epaper
Saturday, November 15, 2025
epaper

నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీలో చార్డర్డ్ ఎకౌంటెంట్లు భాగస్వాములు కావాలి: చార్డర్డ్ అకౌంటెంట్లకు మంత్రి లోకేష్ పిలుపు

కాకతీయ, అమరావతి: దార్శనిక ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఎపి లోని కూటమి ప్రభుత్వం నాలెడ్జ్ బేస్డ్ ఎకానమీని నిర్మిస్తోంది… ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థను 2047నాటికి $2.4ట్రిలియన్ డాలర్లకు చేర్చాలన్నది మా లక్ష్యం. ఈ ప్రయాణంలో చార్డర్డ్ అకౌంటెంట్లు కంట్రిబ్యూటర్లుగా మాత్రమే కాకుండా మార్గదర్శకులుగా నిలవాలని రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ఐసిఎఐ (Institute of Chartered Accountants of India) ఆధ్వర్యాన అర్థసమృద్ధి – 2025 పేరిట వైజాగ్ కన్వెన్షన్స్ లో జరిగిన సదస్సులో మంత్రి లోకేష్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ప్రతి పారిశ్రామిక విప్లవానికి రెండు పార్శ్వాలు ఉంటాయి, ప్రతి పారిశ్రామిక విప్లవం కొత్త అవకాశాలను సృష్టిస్తుంది, గతంలో ఐటి విప్లవం వచ్చినపుడు భారతదేశం అత్యధికంగా లబ్ధిపొందింది, అదేతరహాలో ప్రస్తుతం ఎఐ విప్లవంతో లబ్ధిపొందబోతున్నాం. రాజకీయ పార్టీగా మేం డిజిటల్ లైబ్రరీ, విశ్లేషణాత్మక సమాచారం కోసం ఎఐ వినియోగిస్తున్నాం, అసెంబ్లీలో అర్థవంతమైన చర్చల కోసం ఎఐ టూల్ ను ఉపయోగిస్తాం. ఎఐ ఆధారిత గవర్నెన్స్ ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు కృషిచేస్తున్నాం.

ఈజ్ ఆఫ్ లివింగ్ కు ప్రాధాన్యతనిస్తున్నాం:

ఒకే రాజధాని, అభివృద్ధి వికేంద్రీకరణ మా నినాదం. ఇందులో భాగంగానే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నాం. రాయలసీమలోని అనంతపురంలో ఆటోమోటివ్, కర్నూలులో రెన్యువబుల్ ఎనర్జీ, చిత్తూరులో ఎలక్ట్రానిక్స్, ప్రకాశం జిల్లాలో సిబిజి, గుంటూరు— కృష్ణా జిల్లాలో క్వాంటమ్ వ్యాలీ, గోదావరి జిల్లాల్లో ఆక్వా, ఉత్తరాంధ్రలో ఐటి, ఫార్మా, లాజిస్టిక్స్ పరిశ్రమలకు ప్రాధాన్యత నిస్తున్నాం. CA లు (చార్టర్డ్ అకౌంటెంట్స్) నైతికతతో మెరుగైన పాలసీలను అమలు చేయడంలో మాకు సహాయం అందించాలి. పాలసీలను సరైన దిశలో నడిపించడంలో, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లడంలో ముఖ్యమైన పాత్ర పోషించాలి.

సిఎలు ఆంధ్ర ప్రదేశ్ బ్రాండ్ అంబాసడర్‍గా నిలవాలి. టారిఫ్ వార్ కారణంగా భారత్ నష్టపోకుండా కొత్త మార్కెట్లను అన్వేషించాలి. ఈజ్ ఆఫ్ లివింగ్ కు ప్రాధాన్యతనిస్తూ మనమిత్ర ద్వారా 700రకాల పౌరసేవలను వాట్సాప్ ద్వారా అందిస్తున్నాం. పరిపాలన వ్యవహారాల్లో ఎఐ వినియోగానికి సంబంధించి టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ తో ఒప్పందం చేసుకున్నాం. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు మేం ఏర్పాటుచేసిన వర్కింగ్ గ్రూపులో చేరి మీవంతు సూచనలు, సలహాలు అందించండి.

భోగాపురం ఎయిర్ పోర్టుతో అనూహ్య అభివృద్ధి:

ఎపిలో కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాల వల్ల గూగుల్, టిసిఎస్, కాగ్నిజెంట్ వంటి ప్రఖ్యాత సంస్థలు విశాఖకు రాబోతున్నాయి. ఐసిఎఐ అంటే కేవలం బ్యాలెన్స్ షీట్లు సరిచూసే సంస్థ మాత్రమే కాదు, సమసమాజాన్ని నిర్మించే ఒక వేదిక. సిఎలు అంటే కేవలం ఖాతాపుస్తకాలను చూసే ఆడిటర్లు మాత్రమే కాదు, బాధ్యత, జవాబుదారీతనానికి ప్రతిరూపం. బలమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణంలో సిఎలది కీలకపాత్ర. మరో ఏడాదిలో భోగాపురం ఎయిర్ పోర్టు పూర్తవుతుంది, ఆ తర్వాత ఉత్తరాంధ్ర స్వరూపం మారబోతోంది. దీనివల్ల, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు అనూహ్యంగా అభివృద్ధి చెందుతాయి. ప్రస్తుత శాసనసభలో 50శాతం మంది కొత్తవారు, మంత్రివర్గంలో కూడా 17మంది కొత్తవారే. ఆంధ్రప్రదేశ్ ను నెం.1గా తీర్చిదిద్దేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. రాష్ట్రాభివృద్ధిలో సిఎలు ప్రముఖ పాత్ర పోషించాలి. విశాఖపట్నంలో అకౌంటింగ్, ఆడిటింగ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ను ఏర్పాటు చేసేందుకు ఐసిఎఐ చొరవచూపాలి.

సిటీ ఆఫ్ డెస్టినీ మాత్రమే కాదు:

మీరు కేవలం రికార్డు కీపర్లు మాత్రమే కాదు… భారతదేశ నిర్మాణ రూపశిల్పులు. విశ్వసనీయమైన గణాంకాలు ఉన్న దేశం అన్నివిధాల అభివృద్ధి సాధిస్తుంది. ఆ విశ్వాసానికి ప్రతిరూపం ఆడిటర్లు. ఈ సమావేశాన్ని సిటీ ఆప్ డెస్టినీ విశాఖపట్నంలో జరపడం సముచితమైన నిర్ణయం. ఆంధ్రప్రదేశ్ కు డీప్ వాటర్ పోర్టు, ఐటి, ఫార్మా, మెడిటెక్ పరిశ్రమలు మణిహారం లాంటివి. చంద్రబాబుగారి విజన్ ప్రకారం విశాఖపట్నం అభివృద్ధి చెందితే యావత్ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి సాధిస్తుంది. నేడు విశాఖపట్నం సిటీ ఆఫ్ డెస్టినీ మాత్రమే కాదు… ప్రపంచస్థాయి ఫైనాన్స్, ఇన్నొవేషన్, టెక్నాలజీకి కేంద్రబిందువుగా రూపుదిద్దుకుంటోంది. ఐసిఎఐ ఉపాధ్యక్షుడు ప్రసన్నకుమార్ విశాఖపట్నం వారు కావడం ఆంధ్రప్రదేశ్ లోని సిఎలకు గర్వకారణం. క్రమశిక్షణతో కూడిన ఉత్తమ నాయకత్వానికి ఎల్లలు ఉండవనడానికి ఆయన సాధించిన విజయమే నిదర్శనం.

సంపదసృష్టి మార్గాలను అన్వేషించండి:

ఈరోజు దేశం మీ నుంచి ఆశిస్తున్నది కేవలం కంప్లయెన్స్ నివేదికలు మాత్రమే కాదు. ఎఐ ఆధారిత ఆడిట్లు, బ్లాక్ చెయిన్ ట్రాన్సపరెన్సీ, ఎన్విరాన్ మెంటల్, సోషల్ అండ్ గవర్నెన్స్ (ESG) ఆధారిత సుస్థిర నివేదికలు, ప్రపంచ పెట్టుబడులు, రిస్క్ మేనేజ్ మెంట్, స్టార్టప్ లు, ఎంఎస్ఎంఇలకు మార్గదర్శకత్వం వహించడం వంటి అంశాలపై దృష్టిసారించండి. సంపదను పరిరక్షించడమే కాదు… దానిని సృష్టించే మార్గాలను అన్వేషించండి. కంప్లయన్స్ ను నిర్థారించడమే కాకుండా పోటీతత్వాన్ని మరింత పెంచండి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, పారదర్శకత, ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలతో ముందుకు సాగుతోంది. ఐటి, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్, ఫుడ్ ప్రాసెసింగ్ వంటి రంగాల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తోంది. రాష్ట్రాభివృద్ధికి మీ వంతు సహాయ, సహకారాలు అందించాల్సిందిగా మంత్రి లోకేష్ పిలుపునిచ్చారు.

గూగుల్ వంటి ప్రపంచ ప్రఖ్యాతి సంస్థ విశాఖలో డాటా సెంటర్ ఏర్పాటు చేయబోతుందంటే అందుకు కారణం ప్రధాని మోడీ జీ, చంద్రబాబు గారు తెచ్చిన సంస్కరణల వల్లే. 2019 ఎన్నికల్లో కష్టకాలంలో కూడా మమ్మల్ని విశాఖ ప్రజలు ఆదరించి నలుగురు శాసనసభ్యులను గెలిపించారు. రాబోయే నాలుగేళ్లలో విశాఖనగరం రూపురేఖలు మార్చేసి మీ రుణం తీర్చుకుంటామని మంత్రి నారా లోకేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎంఇ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, ఐసిఎఐ ఉపాధ్యక్షులు ప్రసన్నకుమార్, సదరన్ రీజియన్ వైస్ చైర్మన్ ముప్పాళ్ళ సుబ్బారావు, ఐసిఎఐ విశాఖ బ్రాంచి ప్రతినిధులు అందవరపు శ్రీధర్, రామానాయుడు, పట్నాల లోకేష్, ఉజ్వల, లీలా వరప్రసాద్, గురుమూర్తి, రాంబాబు, సభ్యులు, వృత్తి నిపుణులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

మార్కెట్ లైసెన్స్ జారీ ఆలస్యంపై కలెక్టర్ సీరియస్

మార్కెట్ లైసెన్స్ జారీ ఆలస్యంపై కలెక్టర్ సీరియస్ మార్కెట్ అధికారులు, రైస్ మిల్లర్లతో...

కళ్యాణదుర్గంలో లోకేష్ ప్రజాదర్బార్

కళ్యాణదుర్గంలో లోకేష్ ప్రజాదర్బార్ ప్రజల‌ నుంచి వినతులు స్వీకరించిన మంత్రి అన్ని విధాల అండగా...

పోలీసుల‌పై మందుబాబుల దాడి.

పోలీసుల‌పై మందుబాబుల దాడి. బ‌హిరంగంగా మ‌ద్యం సేవించడంపై మంద‌లించిన పోలీసులు రెచ్చిపోయి దాడి చేసిన...

గుంత‌లు లేని దారులే మా ప్ర‌భుత్వ ల‌క్ష్యం

ప్రజల చేతిలో పల్లె రహదారుల సమాచారం త్వరలో అందుబాటులోకి ‘జియో...

శ్రీ చరణికి రూ.2.5 కోట్ల నజరానా

ఇంటి నిర్మాణానికి 1000 చ.గ. స్థలం గ్రూప్ 1 ఉద్యోగం...

జ‌గ‌న్ ప్ర‌భుత్వంలోనే ఎస్సీ, ఎస్టీల‌కు న్యాయం

కోట మండ‌ల వైసీపీ అధ్య‌క్షులు రాయంకుల‌ కాక‌తీయ. ఏలూరు ప్ర‌తినిధి :...

గిరిజన ‘గూడెం’లో తొలిసారి విద్యుత్ కాంతులు

ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో గూడెంకు వెలుగులు కేంద్ర...

కృష్ణా నదిపై హై లెవెల్ వంతెన

దీవుల్లోని గ్రామాలకు అనుసంధానం రాష్ట్ర నిధులతోపాటు, సాస్కీ పథకం నిధులు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img