కొమ్మాల బ్రహ్మోత్సవాలకు
*మంత్రి కొండాకు నూతన సర్పంచుల ఆహ్వానం
కాకతీయ,గీసుగొండ: కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో నిర్వహించనున్న బ్రహ్మోత్సవాలకు తెలంగాణ రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ను నూతన సర్పంచులు మర్యాదపూర్వకంగా ఆహ్వానించారు.జిల్లా కాంగ్రెస్ నాయకుడు రడం భరత్ ఆధ్వర్యంలో సూర్య తండా సర్పంచ్ బానోతు రాఘవేంద్ర, కొమ్మాల సర్పంచ్ కన్నేబోయిన యమునా ప్రవీణ్,దశ్రు తండా సర్పంచ్ కేలోతు అమృత బిక్షపతి, మానుగొండ సర్పంచ్ పేర్ల శ్రవణ్ కలిసి మంత్రిని కలసి జాతరకు హాజరై స్వామివారి ఆశీస్సులు పొందాలని ఆహ్వాన పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి కళ్యాణ మహోత్సవం,బండ్లు తిరుగుట,రాత్రి రథోత్సవం వంటి ప్రధాన కార్యక్రమాలు భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించనున్నట్లు తెలిపారు బ్రహ్మోత్సవాలు ప్రాంతీయ ఆధ్యాత్మిక సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో సూర్య తండా గ్రామ పార్టీ అధ్యక్షుడు లావుడ్య రాజన్న తదితరులు పాల్గొన్నారు.


