విద్యా రంగ సమస్యలు పరిష్కరించాలి
కాకతీయ, ఏటూరునాగారం : విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని భారత విద్యార్థి ఫెడరేషన్ (ఎస్ఎఫ్ఐ) జిల్లా సహాయ కార్యదర్శి సోడి అశోక్ డిమాండ్ చేశారు. ఏటూరునాగారం డివిజన్ పరిధిలో వివిధ మండలాల్లో సర్వే చేయగా.. అనేక సమస్యలు తెలిశాయని అన్నారు. వెంకటాపురం మండలంలోని వివిధ ఆదివాసీ గిరిజన పాఠశాలలో పూర్తిస్థాయిలో మరమ్మత్తులు లేక బిల్డింగ్ శిథిలావస్థకు చేరిందన్నారు. ఈ విషయం తల్లిదండ్రులు ఏటీడబ్ల్యూ దృష్టికి తీసుకెళ్లినా ఇప్పటి వరకు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పటికైనా అధికారులు స్సందించి సమస్యలు పరిష్కరించాలని, లేకపోతే భవిష్యత్తులో ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు.


