ఇన్‌చార్జి టు ఫుల్ చార్జ్
పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరిమ అగ్రవాల్
సిరిసిల్ల జిల్లా పాలనపై పూర్తి పట్టు
సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర
కాకతీయ, రాజన్న సిరిసిల్ల : రాజన్న సిరిసిల్ల జిల్లా పూర్తిస్థాయి కలెక్టర్‌గా గరీమా అగ్రవాల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వ సాధారణ పరిపాలన విభాగం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. 2019 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారిణి గరీమా అగ్రవాల్ ప్రస్తుతం జిల్లా అదనపు కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. గత కొంతకాలంగా ఆమె ఇన్ఛార్జ్ కలెక్టర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టి జిల్లా పరిపాలనను సమర్థంగా నిర్వహించారు. జిల్లా యంత్రాంగంపై ఇప్పటికే మంచి పట్టును సంపాదించుకున్న గరీమా అగ్రవాల్, అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయడం, ప్రజా సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించడం ద్వారా ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇన్ఛార్జ్ కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో పలు అభివృద్ధి పనులను సమీక్షిస్తూ అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు.ప్రభుత్వం ఆమె సేవలను గుర్తించి పూర్తిస్థాయి కలెక్టర్‌గా నియమించడంతో జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజలు సానుకూల స్పందన వ్యక్తం చేస్తున్నారు.


