స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దుతా..
కాకతీయ, ఇనుగుర్తి: ప్రతి ఇంటిలో మరుగుదొడ్డి, ఇంకుడు గుంతలు నిర్మించుకొని గ్రామాన్ని స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దుతానని సర్పంచ్ భూక్య లక్ష్మీ వెంకన్న నాయక్ అన్నారు. గురువారం లాలు తండా జీపీలో గ్రామసభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ పాల్గొని మాట్లాడుతూ.. గ్రామసభ ఎజెండా లెట్రిన్, బాత్రూంలు నిర్మాణం, ఇంకుడు గుంతలు, నీటి ఎద్దడి రాకుండా చూడడం, ఈజీఎస్ వందరోజుల పని, జిపి బిల్డింగ్ నిర్మాణానికి సంబంధించిన ల్యాండ్ కోసం ఫారెస్ట్ డిపార్టుమెంట్‌తో మాట్లాడడం జరిగిందన్నారు. స్వచ్ఛ గ్రామంగా తీర్చిదిద్దడానికి ప్రజలు సహకరించాలని ప్రభుత్వం నుంచి వచ్చిన పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రజిత రాజు, సెక్రెటరీ సారిక, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సెక్షన్ ఆఫీసర్ రామారావు, రెవెన్యూ అధికారి యాకయ్య, ఈజీఎస్ టెక్నికల్ టి ఏ, వార్డు సభ్యులు భూక్య జీవన్, మాలోతు రవి, శ్రీరామ్, లలిత, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


