epaper
Monday, March 2, 2026
epaper

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగంపెంచాలి

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో వేగంపెంచాలి

త్వ‌ర‌గా పూర్తి చేసి లబ్దిదారులకు అందించాలి

మేడారంలో మరిన్ని శాశ్వత అభివృద్ధి పనులు చేప‌ట్టాలి

గోదావరి పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేయాలి

అధికారుల‌కు మంత్రి సీతక్క ఆదేశాలు

కాకతీయ, ములుగు ప్రతినిధి: ఇందిరమ్మ ఇండ్లను త్వ‌ర‌గా పూర్తి చేసి లబ్దిదారులకు అందించాల‌ని అధికారుల‌ను మంత్రి సీత‌క్క ఆదేశించారు. అదేవిధంగా గోదావరి పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు చేయాల‌న్నారు. గురువారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారంలోని సమ్మక్క సారలమ్మ వన దేవతలను మంత్రి సీతక్క, కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ తో కలిసి దర్శించుకున్నారు. అనంతరం సీతక్క.. మేడారంలోని హరిత హోటల్‌లో మేడారం మాస్టర్ ప్లాన్, జంపన్న వాగు అభివృద్ధి, ఇందిరమ్మ నిర్మాణం, గోదావరి పుష్కరాల నిర్వహణ, వేసవికాలంలో తాగునీటి సరఫరా, సెంట్రల్ లైటింగ్, ఎన్ఆర్ఈజీఎస్ పనులు, పలు అభివృద్ధి పనులపై జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ… జిల్లాలో వివిధ దశలలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లను పూర్తి చేసి లబ్దిదారులతో గృహ ప్రవేశాలు నిర్వహించాలని అన్నారు. పూర్తయిన ఇండ్లకు డబ్బులు చెల్లించాలన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మేడారంలో మరిన్ని శాశ్వత అభివృద్ధి పనులు చేపట్టాలని, భక్తులకు ప్రశాంతమైన దర్శనం కల్పించే విధంగా గద్దెల చుట్టూ గ్రిల్స్ ఏర్పాటు చేయాలని, ఆదివాసీ పూజారులతో సమావేశాలు నిర్వహించి వారి సూచన సలహాలు మేరకు పటిష్టమైన మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని, మేడారం రహదారుల డివైడర్ మధ్య భాగంలో ప్లాంటేషన్ చేయాలని ఆదేశించారు.

జంపన్న వాగుపై చెక్ డ్యామ్ నిర్మాణం

జంపన్న వాగులో నిరంతరం నీరు ప్రవహించేలా చూడడం కోసం జంపన్న వాగుపై చెక్ డ్యామ్ ల నిర్మాణం కోసం నిపుణులతో సర్వే నిర్వహించి ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా ప్రతిపాదనలు సిద్ధం చేసి అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ములుగు జిల్లా కీర్తి ప్రతిష్టలను ప్రపంచ స్థాయిలో గుర్తింపు లభించే విధంగా అభివృద్ధిపరచాలని అన్నారు. వచ్చే ఏడాది 2027లో జరగనున్న గోదావరి పుష్కరాలను పురస్కరించుకుని జిల్లాలోని ప్రధానమైన ఈ పుష్కర ఘాట్ ల వద్ద ప్రజల సౌకర్యార్ధం పరిసరాల పరిశుభ్రతతో పాటు కనీస సదుపాయాలు భక్తులకు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. భక్తుల సౌకర్యార్థం జిల్లాలో నాలుగు పుష్కర ఘాట్లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ సీహెచ్ మహేందర్ జి, అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు సంపత్ రావు, ఎండోమెంట్ అడిషనల్ కమిషనర్ సునీత, గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోతు రవి చందర్, మార్కెట్ కమిటీ చైర్మన్ రేగ కళ్యాణి, పూజారుల సంఘం అధ్యక్షులు జగ్గారావు, ఆర్డీఓ వెంకటేష్, సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

డైరీ ఆవిష్కరణ

ములుగు పట్టణంలోని ఆర్ అండ్ బీ అతిథి గృహంలో పబ్లిక్ హెల్త్ మెడికల్ ఎంప్లాయీస్ ఐఎన్టీయూసీ–3194 యూనియన్ డైరీని మంత్రి సీతక్క ఆవిష్కరించారు. ములుగు జిల్లా జనరల్ ఐఎన్ టియుసి అధ్యక్షులు కొంపల్లి శ్రీనివాసరెడ్డి సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమానికి యూనియన్ జిల్లా అధ్యక్షులు వంగేటి వెంకటేశ్వర్లు, ప్రధాన కార్యదర్శి కోరం శ్రీనివాస్, కోశాధికారి చింతమల్ల వినోద్, సభ్యులు రాజేశ్వరి, శ్రీనివాసరెడ్డి, జంపయ్య తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img