పోలీసుల కంటి వైద్య శిబిరం
వాహనాల డ్రైవర్లకు కంటి పరీక్షలు
ఉచితంగా కళ్ళజోళ్లు పంపిణీ చేసిన సీపీ గౌస్ అలం
కాకతీయ, జమ్మికుంట: జమ్మికుంట మండల కేంద్రంలోని వినాయక గార్డెన్లో వాహనాల డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించి, కళ్ళజోడులను పంపిణీ చేశారు. ఈసందర్భంగా సీపీ గౌస్ ఆలం మాట్లాడుతూ… అనునిత్యం రోజు రోడ్డు మీద నడిపే వాహనదారులు తప్పకుండా కంటి పరీక్ష నిర్వహించుకోవాలని సూచించారు. ముఖ్యంగా, లారీ డ్రైవర్లకు ,స్కూల్ బస్సు డ్రైవర్ల కి చాలా జాగ్రత్తగా నడపాలన్నారు. యాబై మీటర్ల దూరం రూల్ పాటించాలని, మీ గమ్యస్థానాలను సురక్షితంగా చేరుకొని తిరిగి సురక్షితంగా రావాలని కోరారు. కంటి పరీక్షలు చేసిన వారిలో కొందరికి అవసరమైతే ఆపరేషన్ చేపిస్తానని తెలిపారు. ఆటో డ్రైవర్ల కి, ట్రాక్టర్ డ్రైవర్లకి కూడా కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హుజరాబాద్ ఏసీబీ మాధవి, జమ్మికుంట టౌన్ సీఐ రామకృష్ణ గౌడ్, జమ్మికుంట రూరల్ సీఐ, హుజురాబాద్ సీఐ, హుజురాబాద్ వెహికల్ ఇన్స్పెక్టర్ వేణు, వీణవంక ఎస్సై తదితరులు పాల్గొన్నారు.


