మట్టి నమూనా సేకరణపై అవగాహన
కాకతీయ, శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని మోడల్ స్కూల్ విద్యార్థులకు గురువారం స్కూల్ సాయి హెల్త్ కార్డ్ ప్రోగ్రాంలో వ్యవసాయ అధికారులు విద్యార్థులకు మట్టి నమూనా సేకరణపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా అగ్రికల్చర్ అధికారి జి.వెంకటేష్ మాట్లాడుతూ… భూసార పరీక్ష కేంద్రం మట్టిని సేకరించే విధానం, స్కూల్ స్థాయి నుండే విద్యార్థులు దృష్టి పెడితే మేలవుతుందని అన్నారు. మున్ముందు ఉద్యోగ రంగాల్లో పుష్కలంగా అవకాశాలు ఉంటాయి అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ గోదారి రాజేంద్రప్రసాద్, ఉప సర్పంచ్ అకుబతిని విజయ్ కుమార్, మండల వ్యవసాయ అధికారి జి.వెంకటేష్, భూసార పరీక్ష కేంద్రం వ్యవసాయ అధికారులు మమత, అనూష ,ఏఈఓ స్రవంతి, రైతులు పాల్గొన్నారు.


