epaper
Sunday, March 1, 2026
epaper

టెన్త్ పరీక్షలకు 7,317 మంది విద్యార్థులు

టెన్త్ పరీక్షలకు 7,317 మంది విద్యార్థులు

మార్చి 14 నుంచి ఏప్రిల్ 15 వరకు ఎగ్జామ్స్‌

జిల్లాలో మొత్తం 34 పరీక్షా కేంద్రాలు

విద్యార్థుల‌కు ఇబ్బందులు తలెత్తొద్దు

పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

అదనపు కలెక్టర్ గడ్డం నగేష్

కాకతీయ, సిరిసిల్ల టౌన్ : జిల్లాలో నిర్వహించనున్న పదో తరగతి వార్షిక పరీక్షలకు అన్ని శాఖలు సమన్వయంతో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. పరీక్షల నిర్వహణపై బుధవారం సంబంధిత జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… మార్చి 14 నుండి ఏప్రిల్ 15 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. జిల్లాలో మొత్తం 7,317 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానుండగా, వారి కోసం 34 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. పరీక్షా ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాల రవాణా సమయంలో పటిష్ఠ బందోబస్తు చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో నిరంతరాయ విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలని విద్యుత్ శాఖ అధికారులకు సూచించారు. విద్యార్థుల సౌకర్యార్థం పరీక్ష సమయాలకు అనుగుణంగా తగినంత ఆర్టీసీ బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులకు తెలిపారు. పరీక్షా కేంద్రాల పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమలు చేయాలని, పరీక్షలు కొనసాగే సమయంలో సమీపంలోని జిరాక్స్ కేంద్రాలను మూసివేయాలని స్పష్టం చేశారు. మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు తమ పరిధిలోని పరీక్షా కేంద్రాలను ముందుగానే పరిశీలించి అవసరమైన సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. ప్రతి కేంద్రంలో ప్రాథమిక వైద్య సదుపాయం కల్పించి, ఏఎన్‌ఎంలను అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. సమావేశంలో ఏఎస్పీ చంద్రయ్య, జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, డీటీఓ నవీన్ కుమార్, ఆర్టీసీ, పోస్టల్, వైద్య శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మాదక ద్రవ్యాలను నియంత్రించాలి

డ్రగ్స్, మాదక ద్రవ్యాల వల్ల కలిగే తీవ్రమైన నష్టాలపై జిల్లాలో విస్తృత అవగాహన కల్పించాలని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో బుధవారం నిర్వహించిన జిల్లాస్థాయి నార్కోటిక్ కంట్రోల్ సమావేశంలో అదనపు ఎస్పీ చంద్రయ్యతో కలిసి సమీక్ష నిర్వహించారు. సమావేశంలో జిల్లాలో నమోదవుతున్న ఎన్‌డీపీఎస్ కేసులు, గంజాయి సాగు నివారణకు చేపట్టిన చర్యలు, డ్రగ్స్ సరఫరా నియంత్రణ, మాదక ద్రవ్యాల నిర్మూలనకు శాఖల వారీగా చేపట్టాల్సిన కార్యక్రమాలు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా యువతలో పెరుగుతున్న డ్రగ్స్ వినియోగాన్ని అరికట్టేందుకు విద్యాసంస్థల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. మాదక ద్రవ్యాలకు బానిసైన వారిని గుర్తించి వారికి తగిన వైద్య చికిత్స, కౌన్సిలింగ్ అందించేలా చర్యలు తీసుకోవాలని వైద్యారోగ్య శాఖ అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి అఫ్జల్ బేగం, ఎక్సైజ్ అధికారి శ్రీనివాసరావు, జిల్లా విద్యాధికారి జగన్ మోహన్ రెడ్డి, కార్మిక శాఖ అధికారి నజీర్ అహ్మద్, ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img