రూ. 55 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం
కాకతీయ, ఏటూరునాగారం: మండలంలోని గోగుపల్లి గ్రామంలో రూ.55 లక్షల వ్యయంతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణానికి కాంగ్రెస్ నాయకులు శంకుస్థాపన చేశారు. మౌలిక సదుపాయాల అభివృద్ధికి అధిక నిధులు మంజూరు చేస్తున్న మంత్రి సీతక్క కృషిని గ్రామస్తులు ఈ సందర్భంగా ప్రశంసించారు. గ్రామాభివృద్ధి పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉందని, అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించడమే లక్ష్యమని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో మండల నాయకులు చిటమట రఘు, మండల ఎస్టీ సెల్ అధ్యక్షులు చేల వినయ్, మాజీ పిఎసిఎస్ డైరెక్టర్ వంగపండ్ల రవి యాదవ్, వార్డు సభ్యులు ఈసం భిక్షపతి, దుబ్బాక రాకేష్ రెడ్డి, బైరెడ్డి మల్లారెడ్డి, గంట ఠాగూర్, కుంభం రాజేష్, పడిదల హనుమంతు, భరత్, గోగుపెల్లి గ్రామ కమిటీ అధ్యక్షులు సుంకరి సుధాకర్ రెడ్డి, ఈసం లక్ష్మణ్, మహేష్, పెంచికల రాంబాబు, బత్తుల యాదగిరి తదితరులు పాల్గొన్నారు.


