ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ
* చేసిన డిప్యూటీ డిఎంహెచ్వో..
కాకతీయ,శంకరపట్నం: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంగళవారం రోజు డిప్యూటీ డిఎంహెచ్వో చందు ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని వైద్య సేవల గురించి రోగులను అడిగి తెలుసుకున్నారు. మండలంలోని గద్దపాక గ్రామానికి చెందిన దేవునూరి అనుష్క ప్రసవం కోసం రావడంతో ఆమెకు మెరుగైన వైద్య సేవలు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో వైద్యాధికారులు గొట్టే శ్రావణ్ కుమార్, శ్రావణి, సూపర్వైజర్ అనిల్, తదితరులు పాల్గొన్నారు



