గౌరవెల్లి ప్రాజెక్టును వెంటనే పూర్తి చేయాలి.
భారత రాష్ట్ర సమితి హుస్నాబాద్ నియోజకవర్గ అధికార ప్రతినిధి
*ఐలేని మల్లికార్జున రెడ్డి మరియు బుర్ర శ్రీనివాస్ గౌడ్
కాకతీయ :హుస్నాబాద్ : సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం లోని గౌరవెల్లి ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయాలని హుస్నాబాద్ భారత నియోజకవర్గ భారత రాష్ట్ర సమితి నియోజకవర్గ అధికార ప్రతినిధి ఐలేని మల్లికార్జున్ రెడ్డి మరియు బుర్ర శ్రీనివాస్ గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కెసిఆర్ ప్రభుత్వ హయాంలో మొదలైన గౌరవెల్లి ప్రాజెక్టు దాదాపు 2023 వరకు 75% పనులు పూర్తిచేసుకుని కాలువల మరమత్తు మరియు సిసి పనులు పెండింగ్లో ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు గడిచిన ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్నట్టు పనులు ఆగిపోయాయని వెంటనే స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ చొరవ తీసుకొని కాలువలో మరమ్మత్తు మరియు సిసి పనులను పూర్తిచేయాలని కోరారు. ప్రభుత్వం రైతు భరోసాను విస్మరించిందని పేర్కొన్నారు ఎన్నికల వచ్చినప్పుడే రైతు భరోసా గుర్తుకొస్తుందని అన్నారు తెలంగాణ రైతాంగానికి రైతు భరోసా నిధులను రైతుల ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు. 2024 లోనే గౌరవెల్లి ప్రాజెక్టుకు 400 కోట్లు నిధులను తెచ్చినట్టు కాంగ్రెస్ నాయకులు ప్రచారం చేస్తున్నారని 400 కోట్ల నిధులు విడుదలైన ఏ ఒక్క పని పూర్తికాకుండా ఎక్కడ వేసిన గొంగడి అక్కడ అన్నట్టు గౌరవెల్లి ప్రాజెక్టు పరిస్థితి అగమ్య గోచరంగా తయారైందని విమర్శించారు.ఇప్పటికైనా హుస్నాబాద్ వరప్రదాయని అయినా గౌరవెల్లి ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసి రైతులకు నీళ్లు అందించాలని స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కు విజ్ఞప్తి ఈ కార్యక్రమంలో శ్యాంసుందర్ గౌడ్,అరవింద్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


