కాకతీయ, లక్సెట్టిపేట: భారతీయ జనతా పార్టీ మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షుడిగా లక్సెట్టిపేట మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన మాజీ జెడ్పీటీసీ ముత్తె సత్తయ్యను నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు ప్రకటించినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ గురువారం తెలిపారు.
రాష్ట్రంలోని పలువురికి వివిధ హోదాల్లో బిజెపి పదవులను ప్రకటించిందని దీనిలో భాగంగా ముఖ్యమైన పలువురు రాజకీయ అనుభవం గల నాయకులను, పార్టీని బలోపేతం చేయడంలో కీలకంగా వ్యవహరించే నాయకులను ఎంపిక చేసినట్లు తెలిపారు.
తనపై నమ్మకం ఉంచి జిల్లా ఉపాధ్యక్ష పదవిని కట్టబెట్టినందుకు మరింత బాధ్యతతో అందరినీ కలుపుకుని శక్తి వంచన లేకుండా పార్టీ అభివృద్ధికి పాటుపడుతానని ముత్తె సత్తయ్య వెల్లడించారు. వచ్చే స్థానికసంస్థల ఎన్నికల్లో ప్రజలు బిజెపికి పట్టం కడతారన్నారు. తనకు ఈ పదవి రావడానికి కృషి చేసిన బిజెపి రాష్ట్ర, జిల్లా నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.


