epaper
Sunday, March 1, 2026
epaper

రోడ్డు రాజకీయం… ప్రజల‌కే గోస‌లు!!

రోడ్డు రాజకీయం… ప్రజల‌కే గోస‌లు!!
ఎమ్మెల్యే వ‌ర్సెస్ మాజీ ఎమ్మెల్యేల మ‌ధ్య పోటాపోటీ రాజ‌కీయం
నిలిచిపోయిన డబుల్ రోడ్డు ప‌నులు
కోర్టుకెక్కిన వ్యాపారులు… నత్తనడకన నిర్మాణం
పేరుకు డబుల్… వాస్తవానికి సింగిల్ రహదారి
సెంట్రల్ లైటింగ్ ఉన్నా… ప్రజలకు అందని సౌకర్యం

కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి: మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలో 34వ వార్డు నెహ్రూ సెంటర్ నుంచి 20వ వార్డు మంగళ్ కాలనీ వరకు సాగాల్సిన రహదారి అభివృద్ధి పనులు రాజకీయ పోరాటానికి బలైపోయాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మాజీ ఎమ్మెల్యే ప్రారంభించిన ఈ డబుల్ రోడ్డు నిర్మాణం, ప్రస్తుత ఎమ్మెల్యే కాలంలో కూడా పూర్తి స్థాయికి రాకపోవడంతో ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ఆరు–ఏడు ఏళ్లుగా సాగుతున్న ఈ రహదారి పనులు రోడ్డు వెడల్పు కారణంగా ఇరువైపుల వ్యాపారులు, ఇల్లు యజమానులు సెట్‌బ్యాక్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొంతమంది వ్యాపారులు కోర్టును ఆశ్రయించి స్టే ఆర్డర్లు తెచ్చుకోవడంతో పనులు మధ్యలోనే ఆగిపోయాయి. కంకర, డస్ట్, అక్కడక్కడ సీసీ రోడ్డు వేసినప్పటికీ పూర్తి స్థాయిలో రహదారి అందుబాటులోకి రాలేదు.

ఎన్నికల్లో ఎజెండా… అమల్లో ఆలస్యం

మున్సిపల్ ఎన్నికల్లో ఈ రహదారి ప్రధాన ఎజెండాగా మారింది. ఒకవైపు వ్యాపారులు రోడ్డు వెడల్పుకు అంగీకరిస్తే, మరోవైపు కొందరు వ్యాపారులు తీవ్రంగా వ్యతిరేకించి కోర్టు నుంచి డిక్రీ తెచ్చుకోవడంతో పనులు నిలిచిపోయాయి. ఇరువురు ఎమ్మెల్యేలు ప్రయత్నాలు చేసినప్పటికీ నిర్మాణం పూర్తికాకపోవడం ప్రజల్లో నిరాశ కలిగిస్తోంది. నెహ్రూ సెంటర్ నుంచి ఐఎంఏ బిల్డింగ్ వరకు సెంట్రల్ లైటింగ్‌తో డబుల్ రోడ్డు నిర్మాణం ప్రారంభమైనా పూర్తికాలేదు. కొంతదూరం మాత్రమే సెంట్రల్ లైటింగ్‌తో కూడిన రహదారి అందుబాటులోకి రాగా, మిగతా భాగం సింగిల్ రోడ్డు రూపంలోనే ఉంది. పత్తిపాక శివారు దాకా పనులు సాగి ఆ తర్వాత నిలిచిపోవడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులు, చిన్నారులు ధూళి, కాలుష్యంతో ఆరోగ్య సమస్యలు ఎదుర్కొన్నప్పటికీ జిల్లా అధికారులు, ప్రజా ప్రతినిధుల నుంచి స్పష్టమైన చర్యలు కనిపించలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంగా ఎదిగిన మహబూబాబాద్‌లో కీలక రహదారి పూర్తికాకపోవడం ప్రజల్లో అసంతృప్తి రేపుతోంది. ప్రస్తుతం ఈ రహదారి వాహనాల పార్కింగ్ స్థలంగా మారిపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతున్నాయి. “అధికారులు ఉన్నట్టా..? లేనట్టా..?” అన్న ప్రశ్న ప్రజల్లో మళ్లీ మళ్లీ వినిపిస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img