అకాల వర్షం.. అనుకోని నష్టం
మానుకోటలో గాలివానతో వర్షం
నేలకొరిగిన మొక్కజొన్న పంట
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి: మహబూబాబాద్ జిల్లాలో అల్పపీడన ద్రోణితో అకాల వర్షం కురిసింది. జిల్లాలోని కొత్తగూడ మండలం కార్లయి గ్రామంలో వర్షం పడింది. బయ్యారం మండలంలోని బీరోనిమాడువ లో రైతుల మొక్కజొన్న పంట గాలివానతో నేలవాలింది. రైతుల చేతికొచ్చే దశకు మొక్కజొన్న పంట నేలకొరకడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షం తమను ఆగం చేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. నష్టపోయిన పంటకు ప్రభుత్వం తక్షణమే స్పందించి పరిహారం అందించాలని విజ్ఞప్తి చేశారు. అకాల వర్షాలతో రైతులకు నష్టం తప్పడం లేదని దుఃఖం వెల్లపోసుకుంటున్నారు.


