బైక్‌ను ఢీ కొట్టిన కారు.. యువకుడు మృతి
కాకతీయ, పెద్దవంగర :బైక్ ను కారు ఢీ కొట్టడంతో యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన మండలంలోని గట్లకుంట – పోచంపల్లి గ్రామాల మధ్య శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్‌ఐ ప్రమోద్ కుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గట్లకుంట గ్రామానికి చెందిన గుర్రం సంతోష్ (30) బైక్ పై ఇంటికి వస్తుండగా గట్లకుంట – పోచంపల్లి గ్రామాల మధ్యన గట్లకుంట నుండి పోచంపల్లి వైపు వస్తున్న కారు (టిఎస్ 27సి 8001)ఎదురుగా వచ్చి ఢీ కొట్టింది. ఈ సంఘటనలో గుర్రం సంతోష్ అక్కడికక్కడే మృతిచెందాడు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.


