శ్రీరామ గిరిలో ఘనంగా సావర్ లచ్చమ్మ పండుగ
కాకతీయ, నెల్లికుదురు: మండలంలోని శ్రీరామగిరి గ్రామంలో సావర్ లచ్చమ్మ తల్లి పండుగల పురస్కరించుకొని గ్రామ దేవత ఆలయంలో ఘనంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సర్పంచ్ మాదరి ప్రశాంత్ పాల్గొని పూజలు చేసి కొబ్బరికాయలు కొట్టి ఆదివారం ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సావర్ లచ్చమ్మ తల్లి దీవెనలు ఆశీస్సులు,గ్రామ ప్రజలందరి మీద ఉండాలని దేవతను కోరుకున్నామన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ రామగిరి సుమన్, మాజీ వార్డు మెబార్స్, అరపెల్లి రాంచంద్రు, బందు రాములు, అరపెల్లి శ్రీనివాస్, కుల పెద్ద ఎడ్ల వెంకన్న, బిరెల్లి శివ, బందు వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.


