మునిసిపల్ చైర్మన్‌కు ఐఎంఏ సన్మానం
కాకతీయ, జమ్మికుంట : జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో ఇటీవల గెలుపొందిన మున్సిపల్ చైర్మన్ ములుగు ప్రశాంత్ కుమార్, వైస్ చైర్మన్ ముంతాజ్ అలీకి జమ్మికుంట మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘన సత్కారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసోసియేషన్ ప్రతినిధి పిడమర్తి వెంకటేశ్వర్లు నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ జమ్మికుంట పట్టణంలో ప్రజలకు నిరంతరం సేవలందిస్తున్న మెడికల్ షాపుల యాజమాన్యం, వైద్య సిబ్బంది సమాజానికి ఎంతో అవసరమని పేర్కొన్నారు. పట్టణ ప్రజల ఆరోగ్య రక్షణలో మెడికల్ వర్గం కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. మెడికల్ కుటుంబానికి మున్సిపాలిటీ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటానని, సమస్యలు ఉంటే పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. వైస్ చైర్మన్ ముంతాజ్ అలీ కూడా వైద్య రంగం సేవలను అభినందించారు. పట్టణ అభివృద్ధిలో అందరి సహకారం అవసరమని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకన్న, నరసయ్య, గందె రఘు, అలీముద్దీన్, శ్రీనివాస్‌తో పాటు పలువురు మెడికల్ షాప్ యాజమాన్యాలు పాల్గొన్నారు.


