కాకతీయ, నెల్లికుదురు: ఓటర్ జాబితా ప్రతులను ప్రకటించిన సందర్భంగా ఎలాంటి అభ్యంతరాలు ఉన్న తెలపాలని ఎంపీడీవో సింగారపు కుమార్ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు.
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 2025 గ్రామపంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యుల స్థానములకు ఎన్నికలు నిర్వహించుట కొరకు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఓటర్ జాబితాను ప్రకటించామని ఎలాంటి అభ్యంతరాలు ఉన్న శుక్రవారం సాయంత్రం ఐదు గంటల లోపు తెలపాలని, జాబితా పట్ల గుర్తింపు పొందిన పార్టీలతో శనివారం ఉదయం 11 గంటలకు మండల పరిషత్ లో సమావేశం నిర్వహిస్తున్నామని ఆయన తెలిపారు.


