ఎక్సైజ్ శాఖలో పట్టుబడిన వాహనాలకు వేలంపాట
=ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ ఇన్స్పెక్టర్ చిరంజీవి
కాకతీయ, మహబూబాబాద్ ప్రతినిధి: మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో వివిధ కేసుల్లో పట్టుబడిన వాహనాలకు ఈనెల 25న బహిరంగ వేలం పాట నిర్వహించనున్నట్లు ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ జి.చిరంజీవి తెలిపారు. ఈనెల 21 నుండి 25 ఉదయం 9 గంటల వరకు వేలంపాటకు సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తామన్నారు. వేలంపాట పూర్తిగా పారదర్శకంగా జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ ఆఫీసర్ కిరణ్ నాయక్ ఆధ్వర్యంలో వేలంపాట సాగుతుందన్నారు. వేలంపాటలో పాల్గొనేవారు వాహన వాహన ధర అప్సెట్ ప్రైస్ లో 50% డిపాజిట్ చేయాల్సి ఉంటుందన్నారు. వేలంపాటలో పాల్గొనే వాళ్లు ముందుగా వాహనాలను సరిచూసుకొని వేలంలో పాల్గొనాలని సూచించారు. వేలంపాటలో వాహనాన్ని దక్కించుకున్న తర్వాత సదర్ వాహనం తీసుకోకపోతే అతని డిపాజిట్ జప్తు చేయడం జరుగుతుందన్నారు. దరఖాస్తు తోపాటు ఆధార్ కార్డు జిరాక్స్ కూడా సమర్పించాలని తెలిపారు. వేలం పాటలో వాహనం తీసుకున్న వారు అదే రోజు మొత్తం అమౌంటు జిఎస్టి తో సహా చెల్లించి స్వాధీన పరచుకోవాలని వివరించారు.


