కాకతీయ, పరకాల : హనుమకొండ జిల్లా పరకాల కోర్టు అదనపు న్యాయమూర్తిగా కుమారి శ్రీవల్లి శైలజ గురువారం బాధ్యతలు స్వీకరించారు. నాలుగు సంవత్సరాలుగా అదనపు న్యాయమూర్తి పోస్టు ఖాళీగా ఉంది. ఈ నియామకం ద్వారా పరకాల, దామెర,నడి కూడ, మండలాల ప్రజలకు అణువుగా ఉంటుందని కేసు విచారణలకు ఇబ్బందులు ఉండవని పరకాల కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి సాయి శరత్ పేర్కొన్నారు.
ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు పెండెల భద్రయ్య సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రధాన న్యాయమూర్తి సాయి శరత్ హాజరై బార్ అసోసియేషన్ సభ్యులతో కలిసి అదనపు న్యాయమూర్థిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు పున్నం రాజిరెడ్డి, ఒంటేరు రాజమౌళి, ఏజిపి మెరుగు శ్రీనివాస్, కార్యదర్శి శ్రావణ్ కుమార్, శ్రీనివాస్,చంద్రమౌళి, పరమేశ్వర్,సాబీర్, లక్కం శంకర్,తదితర న్యాయవాదులు పాల్గొన్నారు.


