epaper
Monday, March 2, 2026
epaper

మావోయిస్టు పార్టీకి భారీ షాక్..?

మావోయిస్టు పార్టీకి భారీ షాక్..?
కేంద్ర కమిటీ కార్యదర్శి మల్లా రాజిరెడ్డి సహా 25 మంది లొంగుబాటు?
కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో అదుపులోకి తీసుకున్నట్లు ప్రచారం
లొంగుబాటా..? అరెస్టా..? స్పష్టత కోసం ఉత్కంఠ

కాకతీయ, తెలంగాణ బ్యూరో : మావోయిస్టు పార్టీకి మరో భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు వార్తలు వెలువడుతున్నాయి. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ కార్యదర్శి మల్లా రాజిరెడ్డి అలియాస్ సంగ్రామ్ అలియాస్ మీసాల సత్తన్నతో పాటు మరో 25 మంది మావోయిస్టులు తెలంగాణ రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట లొంగుబాటుకు సిద్ధమైనట్లు సమాచారం. ఈ పరిణామం దేశ‌వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే వీరు స్వచ్ఛందంగా లొంగిపోతున్నారా లేక పోలీసులు అరెస్ట్ చేసి లొంగుబాటుగా చూపిస్తున్నారా అన్న అంశంపై ఇంకా అధికారిక స్పష్టత వెలువడలేదు. తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు ఇటీవల భారీ కూంబింగ్ ఆపరేషన్లు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ ఆపరేషన్లలో భాగంగానే మల్లా రాజిరెడ్డి బృందాన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఈ చర్యలో భాగంగా మావోయిస్టుల వద్ద నుంచి ఆయుధాలు, మందుగుండు సామగ్రి స్వాధీనం చేసుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. కేంద్ర ప్రభుత్వం దేశాన్ని నక్సల్స్ రహితంగా మార్చాలనే లక్ష్యంతో మార్చి 31, 2026 వరకు గడువు విధించిన నేపథ్యంలో ఈ పరిణామం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ గడువు లోపు లొంగిపోయే మావోయిస్టులకు పునరావాసం, ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కేంద్రం ప్రకటించింది. అదే సమయంలో లొంగిపోని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

లొంగుబాటుపై సందేహాలు.. ప్రజాసంఘాల ప్రశ్నలు

మల్లా రాజిరెడ్డి లొంగుబాటుపై ప్రజాసంఘాలు, హక్కుల సంస్థలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. పోలీసులు ముందుగా అరెస్ట్ చేసిన వ్యక్తులను తరువాత లొంగుబాటుగా చూపించే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తున్నారు. నిజంగా స్వచ్ఛంద లొంగుబాటా లేదా పోలీసుల ఆపరేషన్ ఫలితమా అన్న విషయంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. మల్లా రాజిరెడ్డి మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీలో కీలక నేతగా కొనసాగుతున్నాడు. ఆయన అనేక సంవత్సరాలుగా అండర్‌గ్రౌండ్‌లో పనిచేస్తూ పార్టీ కార్యకలాపాలను నడిపించిన ప్రముఖ నాయకుడిగా గుర్తింపు పొందాడు. గతంలో ఆయన మరణించాడన్న వార్తలు వచ్చినప్పటికీ పార్టీ వాటిని ఖండించింది. ప్రస్తుతం ఆయన లొంగుబాటు వార్తలు వెలువడడం మావోయిస్టు పార్టీలో పెద్ద పరిణామంగా భావిస్తున్నారు. ఇదిలా ఉండగా, ఇటీవల కూడా పలువురు కీలక మావోయిస్టు నేతలు లొంగుబాటు కావడం లేదా భద్రతా బలగాల ఆపరేషన్లలో పట్టుబడటం గమనార్హం. దీంతో మావోయిస్టు పార్టీ కార్యకలాపాలు బలహీనపడుతున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మల్లా రాజిరెడ్డి సహా 25 మంది లొంగుబాటుపై పోలీసు శాఖ నుంచి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. పూర్తి వివరాలు వెలుగులోకి వచ్చిన తర్వాతే ఈ ఘటనపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ పరిణామం ఉత్కంఠ రేకెత్తిస్తోంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img