37వ డివిజన్ అభివృద్ధి పనులకు వేగం పెంచాలి
కాకతీయ, ఖిలా వరంగల్ : ఖిలా వరంగల్ 37వ డివిజన్‌లో కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేసి త్వరగా పూర్తి చేయాలని కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్ కోరారు. ఈ మేరకు ఆమె గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బజపేయ్‌ను కలిసి డివిజన్‌లోని సమస్యలు, పనుల పురోగతిపై చర్చించారు. డివిజన్‌లో సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాల పనులు ఆలస్యం కాకుండా నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని కమిషనర్‌కు విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు నాణ్యతతో చేపట్టాలని, అభివృద్ధి పనుల అమలులో నిర్లక్ష్యం ఉండకూడదని పేర్కొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ సంబంధిత శాఖ అధికారులకు పనులను వేగవంతం చేసి నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను సూచించారు. డివిజన్ అభివృద్ధికి తమ వంతు కృషి కొనసాగిస్తామని కార్పొరేటర్ సువర్ణ సురేష్ తెలిపారు.


