గ్రామపంచాయితీ పాలనపై అవగాహన పెంపొందించుకోవాలి
*జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి
కాకతీయ,గీసుగొండ: గ్రామాల అభివృద్ధిలో పాలనా అంశాలపై సర్పంచులు పూర్తి అవగాహన కలిగి ఉండాలని వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి పేర్కొన్నారు. గంగాదేవిపల్లి గ్రామంలో సర్పంచులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో శుక్రవారం పాల్గొని మాట్లాడారు. 2018 పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం సర్పంచులు పాలనా పరమైన నిర్ణయాలు చట్టబద్ధంగా, పారదర్శకంగా తీసుకోవాలని సూచించారు. గ్రామస్థాయి అభివృద్ధి పనులు, నిధుల వినియోగం, సమావేశాల నిర్వహణ, తీర్మానాల అమలు వంటి అంశాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ సీఈవో రాం రెడ్డి, డిపిఓ కటకం కల్పన, డియల్పివో రాజీవ్ కుమార్, ఎంపీడీఓ లెక్కల అరుంధతి, ఎంపీఓలు పాక శ్రీనివాస్, సునీల్ కుమార్ రాజు, కుచన ప్రకాష్, జిల్లా శిక్షణ మేనేజర్ కూసం రాజమౌళి, స్వచ్ భారత్ కన్సల్టెంట్ శ్రీనివాసరావు, ఖానాపూర్, దుగ్గొండి, నర్సంపేట, రాయపర్తి మండలాల సర్పంచులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి ఉత్తమ గ్రామ ఎంపికలో భాగంగా రాష్ట్ర స్థాయిలో చైల్డ్ ఫ్రెండ్లీ పంచాయితీగా మండలంలోని ఆరెపల్లి గ్రామాన్ని ఎంపిక చేయగా, గ్రామాన్ని సీఈవో రాం రెడ్డి, డిపిఓ కటకం కల్పన సందర్శించారు. వారం రోజుల్లో సెంట్రల్ బృందం గ్రామానికి రానున్నట్లు తెలిపారు


