కాకతీయ, వరంగల్ : తెలంగాణ ఎంప్లాయ్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు సెప్టెంబర్ 1వ తేదీన పెన్షన్ విగ్రహ దినంగా పాటిస్తూ పాత పెన్షన్ సాధన సభ గోడపత్రికను జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో గురువారం వరంగల్ జిల్లా ఉద్యోగుల జేఏసీ చైర్మన్ గజ్జల రామ్ కిషన్ ముఖ్య అతిథిగా పాల్గొని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా రామ్ కిషన్ మాట్లాడుతూ ఉద్యోగుల న్యాయమైన హక్కుల కోసం ఉద్యోగ వర్గం అంతా సమిష్టిగా కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. అలాగే ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధనకై రాష్ట్ర ప్రభుత్వంతో ఎప్పటికప్పుడు చర్చలు జరిగినప్పటికీ సమస్యలు పరిష్కారం కానందున వాటి పరిష్కారానికి పోరాడేందుకు ఉద్యోగ జేఏసీ ఉద్యమ కార్యాచరణలో భాగంగా సెప్టెంబర్ 1వ తేదీన పెన్షన్ విద్రోదినంగా పాటిస్తూ పాత పెన్షన్ సాధన సభను విజయవంతం చేయాలని దీనికి అనుగుణంగా వరంగల్ జిల్లా ఉద్యోగ జేఏసీ అన్ని భాగస్వామ్య సంఘాలు పాల్గొని మన సమస్యలు పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేసే విధంగా పాత పెన్షన్ విధానాన్ని సాధించే విధంగా మనం ఉద్యమించాలని వారన్నారు.
సెప్టెంబర్ 1వ తేదీన ఉదయం 10 గంటలకు జిల్లా కేంద్రంలో నిరసన కార్యక్రమం అనంతరం హైదరాబాదులో జరుగు పాత పెన్షన్ సాధన సభ లో పాల్గొనాలని
పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎన్జీవో జిల్లా ప్రధాన కార్యదర్శి గాజే వేణుగోపాల్, టిపిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు ఊకంటి అశోక్, టిఆర్టిఎఫ్ అధ్యక్షులు కిషన్, 4వ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సాంబయ్య, పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షులు ధర్మరాజు, వ్యవసాయ మార్కెట్ కమిటీ పెన్షనర్ల సంఘం అధ్యక్షులు నాగపురి సారంగపాణి, టీఎన్జీవో జిల్లా కోశాధికారి పాలకుర్తి సదానందం, ఉపాధ్యక్షులు ఇంద్రసేనారెడ్డి, బత్తిని రమాదేవి, టీఎన్జీవో సిటీ అధ్యక్షులు శంకేష్ రాజేష్, కార్యదర్శి మధుచంద్ర, జిల్లా సహాయ కార్యదర్శులు సుభాష్, రజనీకాంత్, రామకృష్ణ, గణేష్ ప్రచార కార్యదర్శి యూసఫ్ నర్సంపేట తాలూకా అధ్యక్షులు సురేష్ రెడ్డి, నాలుగవ తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి భాను ప్రకాష్, టీఎన్జీవో జిల్లా నాయకులు నాగేశ్వరరావు, శ్రీనివాస్, కిషన్ నాయక్, లక్ష్మారెడ్డి, అనిల్, తదితరులు పాల్గొన్నారు.


