కాకతీయ, వరంగల్: హనుమకొండ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో హెచ్ సి ఎల్ టెక్నాలజీస్ వారు హెచ్ సి ఎల్ టెక్ బీ ప్రోగ్రామ్ పేరుతో మెగా జాబ్ డ్రైవ్ ను ఈ నెల ఆగస్ట్ 30వ తేదీ (శనివారం) ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఐ సి ఎస్ ఎస్ కంప్యూటర్ ఎడ్యుకేషన్, అంబేద్కర్ విగ్రహం సమీపంలో, హనుమకొండ (ఓ పీ : బి ఎస్ ఎన్ ఎల్ ఆఫీస్ ) వద్ద జరగనుందని జిల్లా డి ఐ ఈ ఓ గోపాల్ తెలిపారు.
అర్హతలు..
2024/2025 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన విద్యార్థులు ఎంపీసీ, ఎం ఈ సి, సి ఈ సి, బైపిసి, వొకేషనల్ కంప్యూటర్స్ గ్రూపుల వారు, ప్రత్యేకంగా ఎంపీసీ విద్యార్థులు 75% ఓవరాల్ మార్కులు, అలాగే గణితంలో కనీసం 60% మార్కులు సాధించి ఉండాలి.
కావాల్సిన పత్రాలు..
పదో తరగతి పాస్ సర్టిఫికెట్ నకలు, ఇంటర్మీడియట్ పాస్ సర్టిఫికెట్ నకలు, ఆధార్ కార్డు నకలు, ఒక పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ఆండ్రాయిడ్ మొబైల్ అర్హులైన అభ్యర్థులు పై పత్రాలతో జాబ్ డ్రైవ్ కు హాజరుకావాలని అధికారులు సూచించారు. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన నెంబర్లు :
? 7569177071 / 7981834205 లకు సంప్రదించాలని తెలిపారు.


