ప్రజల అభివృద్ధి, సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వ లక్ష్యం
అన్నం ప్రవీణ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు
కాకతీయ, జమ్మికుంట : ఇల్లంతకుంట మండలం పాతర్లపల్లి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్లు ముగ్గు కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగిందని అన్నం ప్రవీణ్ తెలిపారు.
ఈ సందర్భంగా అన్నం ప్రవీణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకు సొంత ఇంటి కల నెరవేరుస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం అనేది పేద ప్రజలకు గృహ హక్కు కల్పించాలనే మహోన్నత ఆలోచనతో ప్రారంభమైన గొప్ప సంకల్పమని అన్నారు.కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇంచార్జ్ వొడితల ప్రణవ్ గారి సహకారంతో పాతర్లపల్లి గ్రామానికి 24 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయని తెలిపారు. ప్రజలంతా సంతోషంగా తమ సొంత ఇంటి కల నెరవేరుతుందని సంతోషం వ్యక్తంచేశారని తెలిపారు.ప్రజలంతా కాంగ్రెస్ పార్టీకీ, ప్రజా ప్రభుత్వానికే మా మద్దతు ఉంటుందని తెలిపారని అన్నం ప్రవీణ్ అన్నారు.
“ప్రతి పేద కుటుంబానికి గౌరవప్రదమైన నివాసం”
ప్రతి ఇంటికి సంతోషం,ప్రతి కుటుంబానికి భద్రత” అనే నినాదంతో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తుందని అన్నం ప్రవీణ్ తెలిపారు.
ప్రజల అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా, ముందుకు సాగుతున్న కాంగ్రెస్ పార్టీకి మీ ఆశీర్వాదాలు ఉండాలని, మీ సహకారంతో మన గ్రామాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్దామని ప్రవీణ్ కోరారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బైరెడ్డి కొండాల్ రెడ్డి, ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు మడిపల్లి మంగసంపత్, కొడారి సునీతారాజు, కొడారి లతకొమురయ్య, నాయకులు కోడం నారాయణ, కోడం భిక్షపతి, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.


