దూరం తగ్గింది ప్రజల వద్దకు రేషన్ వచ్చింది
కాకతీయ,నర్సింహులపేట: ప్రజల యొక్క అవసరాలు,నిత్య ప్రజలకు సరైన పాలన అందించాలనే ఉద్దేశంతో రేషన్ తీసుకోవడానికి దూరప్రాంతం వెళ్తున్న లోక్యతండ గ్రామపంచాయతీ పరిధిలోని మూడు తండావాసుల ఇబ్బందులను గ్రహించి ఎమ్మెల్యే డోర్నకల్ నియోజకవర్గ శాసనసభ్యులు రామచంద్రనాయక్ గారు ఈరోజు మూడు తండాలో రేషన్ షాప్ సెంటర్ మరొకటిగా విభజించి అక్కడే ఉండే విధంగా ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా ఉండేవిధంగా సెంటర్ ను ఏర్పాటు చేశారు.ఈసమస్యను పరిష్కరించినందుకు సర్పంచ్ రాజేందర్ కు ఎమ్మెల్యే రామచందర్ నాయక్ మరియు అధికారులకు, ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తండావాసులు తెలిపారు.


