జమ్మికుంటలో ఘనంగా శివాజీ జయంతి వేడుకలు
డిగ్రీ కళాశాల గ్రౌండ్ నుంచి ఇంద్రనగర్ వరకు బైక్ ర్యాలీ
మున్సిపల్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
: చైర్మన్ ప్రశాంత్ కుమార్
కాకతీయ, జమ్మికుంట: ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్భంగా జమ్మికుంట మండలంలో బుధవారం వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని డిగ్రీ కళాశాల గ్రౌండ్ నుంచి ప్రారంభమైన బైక్ ర్యాలీ ఇంద్రనగర్‌లో ఉన్న శివాజీ మహరాజ్ విగ్రహం వరకు సాగింది. యువత, నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ (దిలీప్) మాట్లాడుతూ శివాజీ మహరాజ్ దేశానికి చేసిన సేవలను స్మరించుకున్నారు. ఆయన చూపిన ధైర్యసాహసాలు, పరిపాలనా విధానాలు నేటి తరానికి ఆదర్శమని పేర్కొన్నారు. జమ్మికుంట మున్సిపాలిటీ అభివృద్ధిలో తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు.
కార్యక్రమంలో గౌరవ కౌన్సిలర్లు కొలుగూరి సురేష్, కొలకాని రాజు, కుతాటి తిరుపతి, ఇల్లంతకుంట దేవస్థాన చైర్మన్ రామారావు, శివ నరేష్ తదితరులు పాల్గొన్నారు. వేడుకలు శాంతియుతంగా నిర్వహించబడినట్లు నిర్వాహకులు తెలిపారు


