epaper
Monday, March 2, 2026
epaper

సరిహద్దుల్లో తుపాకుల మోత…

సరిహద్దుల్లో తుపాకుల మోత…
కర్రెగుట్ట అడవుల్లో ఐదుగురు మావోయిస్టుల మృతి
‘ఆపరేషన్ కగార్–2’లో కూంబింగ్ ఉధృతి
అగ్రనేతల వేటలో ప్రత్యేక దళాలు
మార్చి 31 లక్ష్యానికి కౌంట్‌డౌన్

కాకతీయ, ఏటూరునాగారం : తెలంగాణ–ఛత్తీస్‌గఢ్ సరిహద్దు మరోసారి తుపాకీ మోతలతో మార్మోగింది. కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో గురువారం జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌లో ఐదుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. కేంద్రం చేపట్టిన “నక్సల్ రహిత భారత్” లక్ష్యంలో భాగంగా కొనసాగుతున్న ‘ఆపరేషన్ కగార్–2’లో భాగంగానే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం.
గత కొన్ని రోజులుగా దట్టమైన అడవుల్లో భద్రతా బలగాలు విస్తృత కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. గూఢచారి సమాచారం ఆధారంగా ప్రత్యేక బృందాలు లోతట్టు ప్రాంతాల్లో గాలింపు చేపట్టగా, మావోయిస్టులు కాల్పులకు దిగినట్లు తెలుస్తోంది. ఎదురుకాల్పుల్లో ఐదుగురు మృతి చెందినట్లు ప్రాథమిక సమాచారం. మృతుల్లో కీలక అగ్రనేతలు ఉండే అవకాశముందని భావిస్తున్నప్పటికీ, అధికారిక గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది.

అగ్రనేతలే టార్గెట్

మావోయిస్టు అగ్రనేతలు దేవ్‌జీ, సోది, బడే చొక్కారావును లక్ష్యంగా చేసుకుని ఈ ఆపరేషన్‌ను తీవ్రతరం చేసినట్లు భద్రతా వర్గాలు చెబుతున్నాయి. దండకారణ్య ప్రాంతంలో చురుకుగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ నాయకుల కదలికలపై నిఘా పెంచిన బలగాలు సమన్వయంతో ముందుకు సాగుతున్నాయి.

భారీ బలగాల మోహరింపు

ఈ కూంబింగ్ ఆపరేషన్‌లో సుమారు ఐదువేల మంది భద్రతా సిబ్బంది పాల్గొంటున్నారు. కేంద్ర రిజర్వ్ పోలీసు దళం, కోబ్రా కమాండోలు, గ్రేహౌండ్స్ ప్రత్యేక దళాలు, జిల్లా రిజర్వ్ గార్డు బలగాలు సరిహద్దు అడవుల్లో మోహరించాయి.

గడువు సమీపంలో

కేంద్ర హోం మంత్రి అమిత్ షా నిర్దేశించిన మార్చి 31, 2026 గడువు దగ్గరపడుతోంది. దేశాన్ని నక్సలిజం నుంచి విముక్తం చేయాలనే లక్ష్యంతో ఆపరేషన్‌లు వేగవంతం చేశారు. గడువుకు కేవలం నలభై రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో అడవుల్లో బలగాల పట్టు మరింత కఠినమవుతోంది.
సరిహద్దు ప్రాంతంలో ఇంకా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మరిన్ని ఎదురుకాల్పులు జరిగే అవకాశముండటంతో భద్రతా బలగాలు అప్రమత్తంగా గాలింపు కొనసాగిస్తున్నాయి. అధికారిక ప్రకటనల కోసం ఎదురు చూస్తున్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img