ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆకస్మిక తనిఖీ
*రికార్డుల పరిశీలన
కాకతీయ,నర్సింహులపేట: దంతాలపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంను మహబూబాబాద్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవి రాథోడ్ బుధవారం ఆకస్మిక తనిఖీ చేశారు. తనకి లో భాగంగా హాజరు పట్టిక మరియు పని రికార్డులను పరిశీలించారు.హాస్పిటల్లో రోగులకు అందుతున్న సేవల గురించి వైద్యాధికారి డాక్టర్ కవితను అడిగి తెలుసుకున్నారు.పేషంట్ లతో మాట్లాడి వైద్య పరంగా అందుతున్న సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు.ఇన్వర్టర్ లను పరిశీలించారు.ఈకార్యక్రమంలో వైద్యాధికారి కవిత, వెంకటేశ్వరరాజు,సూపర్వైజర్లు, స్టాఫ్ నర్సులు,హెల్త్ అసిస్టెంట్, డీఈవో తదితరులు పాల్గొన్నారు.


