పాత్రికేయుడిని పరామర్శించిన ఎమ్మెల్యే దొంతి
కాకతీయ, దుగ్గొండి: వార్త దినపత్రిక నర్సంపేట ఆర్సీ ఇంచార్జ్ రండం శ్రీనివాస్ తండ్రి రడం సారయ్య అనారోగ్యంతో మృతి చెందగా ఎమ్మెల్యే దొంతి మాధవ రెడ్డి ఆయన స్వగ్రామమైన తిమ్మంపేటకు వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. సారయ్య పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను ఓదార్చిన ఎమ్మెల్యే, ఈ క్లిష్ట సమయంలో ధైర్యంగా ఉండాలని సూచించారు. సారయ్య మృతితో కుటుంబానికి తీరని లోటు ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్ కూడా పాల్గొని నివాళులు అర్పించారు. ఎమ్మెల్యే వెంట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తోకల శ్రీనివాస్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు చుక్క రమేష్, నాయకులు బండారి ప్రకాష్ తదితరులు ఉన్నారు. బీఆర్ఎస్ నాయకులు రాజేశ్వర్ రావు, కంచరకుంట్ల శ్రీనివాస్ రెడ్డి, పిండి కుమారస్వామి తదితరులు కూడా హాజరై నివాళులు అర్పించారు. గ్రామస్తులు, స్నేహితులు పెద్ద సంఖ్యలో హాజరై కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.


