epaper
Monday, March 2, 2026
epaper

ఐటీడీఏలో నిర్లక్ష్యం

ఐటీడీఏలో నిర్లక్ష్యం
పరిపాలనను బ్రష్టు పట్టిస్తున్న అధికారిని వెంటనే బదిలీ చేయాలి
ఆదివాసీల అభివృద్ధికి కట్టుబడి పనిచేసే అధికారులే కావాలి
బడ్జెట్ లేక ఐటీడీఏలు రెక్కలు విరిగిన పక్షిలా మారింది
క్షేత్ర పర్యటనలు చేయకుండా అధికారులు గెస్ట్ హౌస్‌కే పరిమితం
సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ నిబంధనలు అమలు కావడంలేదు
నిర్లక్ష్యంతో గిరిజనుల అభివృద్ధి వెనుకబడుతోంది
తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు తాటి నీలాద్రి

కాకతీయ, ఏటూరునాగారం : ఐటీడీఏలో పరిపాలనా వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైందన్న ఆరోపణలతో ఆదివాసీలలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో తుడుం దెబ్బ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ప్రాజెక్టు అధికారిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు తాటి నీలాద్రి మాట్లాడుతూ, ఐటీడీఏ పరిపాలనను బ్రష్టు పట్టిస్తున్న ప్రాజెక్టు అధికారిని వెంటనే బదిలీ చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలోని ఏజెన్సీ ప్రాంతాల్లో ఆదిమ తెగల అభివృద్ధి, హక్కుల పరిరక్షణ కోసం ప్రత్యేక చట్టాలు, జీవోలు అమలులో ఉన్నప్పటికీ, ప్రస్తుతం ఐటీడీఏలు తమ ప్రాధాన్యతను కోల్పోయి బడ్జెట్ కేటాయింపులు లేక రెక్కలు విరిగిన పక్షిలా మారిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఐటీడీఏలు 29 శాఖల సమన్వయంతో సమర్థవంతంగా పనిచేసేవని, ఇప్పుడు మాత్రం నిర్లక్ష్యంతో ఆదివాసీల సమస్యలు పెరుగుతున్నాయని తెలిపారు.

క్షేత్రస్థాయిలో కనిపించని అధికారులు

ప్రాజెక్టు అధికారి సమయానికి కార్యాలయానికి రాకపోవడం, సిబ్బంది కూడా సమయపాలన పాటించకపోవడం వల్ల పరిపాలన పూర్తిగా దెబ్బతింటోందని మండిపడ్డారు. అధికారులు హెడ్‌క్వార్టర్స్‌లో ఉండకుండా పట్టణాల నుండి రాకపోకలు సాగించడం గిరిజనుల సమస్యల పట్ల ఉన్న నిర్లక్ష్యాన్ని చూపిస్తోందన్నారు. ప్రాజెక్టు అధికారి కార్యాలయానికి రావడం కంటే గెస్ట్ హౌస్‌కే పరిమితమవుతున్నారని తీవ్రంగా విమర్శించారు. సింగిల్ లైన్ అడ్మినిస్ట్రేషన్ జీవో ప్రకారం ప్రాజెక్టు అధికారి నెలలో కనీసం 15 రోజులు క్షేత్రస్థాయిలో పర్యటించి, ఐదు రోజులు గ్రామాల్లో బస చేయాల్సి ఉన్నప్పటికీ, ఆ నిబంధనలను పూర్తిగా విస్మరిస్తున్నారని ఆరోపించారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించకపోవడం వల్ల గిరిజనుల సమస్యలు ప్రభుత్వ దృష్టికి చేరడం లేదని తెలిపారు.

ఐటీడీఏ బలోపేతం కోసం చర్యలు తీసుకోవాలి

ప్రస్తుత పరిస్థితుల్లో ఐటీడీఏల పనితీరు తీవ్రంగా దెబ్బతిన్నదని, గిరిజనుల అభివృద్ధి అనేక సంవత్సరాలు వెనుకబడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఆదివాసీల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న ప్రాజెక్టు అధికారిని వెంటనే బదిలీ చేసి, సమర్థవంతమైన అధికారిని నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఐటీడీఏలను బలోపేతం చేసి, గిరిజనుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలని కోరారు. ఈ సమావేశంలో మండల ఉపాధ్యక్షులు కోరం సుధాకర్, ప్రధాన కార్యదర్శి ఈసం పణికుమార్, పిట్టల నాగేశ్వరావు, చాట్ల విజయ్, బొగ్గం శివకుమార్, చింత లక్ష్మణ్ స్వామి, పలక నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img