కాకతీయ, ములుగు: రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకకాశముందని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో ములుగు జిల్లాలోని లోతట్టు ప్రాంతాల, గోదావరి, జంపన్న వాగు పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ములుగు జిల్లా ఏస్పీ శభరీష్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు వరద నీటి ప్రవాహంలో ఉన్న వంతెనలు, కల్వర్టులు, రహదారుల పై నుంచి దాటరాదని, శిధిలావస్థలో ఉన్న ఇండ్లలో నివాసం ఉండకూడదని, తడిగా ఉన్న విద్యుత్ కరెంట్ పోల్స్, ట్రాన్స్‌ఫార్మర్లను తాకరాదని, గ్రామాల్లో చేపల వేటకు ఎవరూ వెళ్లకూడదని జిల్లా ఏస్పీ తెలిపారు.
అత్యవసరం అయితే తప్ప బయటకు రావద్దని, వరద ప్రవహాల వద్ద విధులు నిర్వహిస్తున్న పోలీస్ సిబ్బంది సూచనలు పాటించాలని ప్రజలకు విజ్ఙప్తి చేశారు. భారీ వర్షాలు, వరదల నేపద్యంలో పోలీస్ యంత్రాంగం అప్రమత్తంగా ఉండడం జరిగిందని, విపత్కర పరిస్థితులు ఎదురైన వాటిని ఎదుర్కోనేందుకు పోలిస్ శాఖ సిద్దంగా ఉందని, అలాగే ముంపు ప్రాంతాల్లో తక్షణ సహచ చర్యల కోసం జిల్లా విపత్తు ప్రతి స్పందన దళాలు (డీడీఆర్ఏఫ్)(ఏస్‌డీఆర్ఏఫ్) ఏర్పాటు చేయడం జరిగిందని ఏస్పీ తెలిపారు.
ఎటువంటి అత్యవసర పరిస్థితులు తలెత్తిన ప్రజలు పోలీస్ సహయం కోసం డయల్ 100 వినియోగించుకోవాలన్నారు. ములుగు మీదుగా ఏటూరునాగారం, వెంకటాపురం, వాజీడు, మంగపేట మండలాలు వెళ్లే ప్రయాణికులు, బోగోత జలపాతం విక్షించే పర్యాటకులు వర్షాలు తగ్గే వరకు తమ ప్రయాణాలను తాత్కాలికంగా వాయిదా వేసుకోవాలని జిల్లా ఏస్పీ తెలిపారు. ఇప్పటికే భారీ వర్షం వలన ముంపు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రాజెక్ట్ నగర్ లోని 10 కుటుంబాలను పునరావాస కేంద్రంకి తరలించడం జరిగిందని, అలాగే వరద ప్రవహాల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని ఏప్పటికప్పుడు అప్రమత్తం చేయడం జరుగుతుందని అయన తెలిపారు.
ప్రయాణికులు ఇలా వెళ్లండి.. పోలిస్ శాఖ..
1. ములుగు పోలీస్ స్టేషన్ పరిధి.
సర్వపూర్ శివారులో బొగ్గులవాగు వరద ప్రవాహం పెరిగి రహదారి మీదుగా వరద ప్రవహిస్తోంది.
డైవర్షన్ రూట్: జగ్గన్నగూడెం వైపు ప్రయాణం చేసే వారు అంకన్నగూడెం మీదుగా వెళ్లాలి.
2. వెంకటాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి.
వెళ్తుర్లపల్లి నుండి కొండాపూర్ వెళ్లే రహదారిలో మోరంచ వాగు వరద ప్రవాహం పెరిగి రహదారి మీదుగా ప్రవహిస్తోంది.
డైవర్షన్ రూట్: కొండాపూర్ వెళ్లేవారు ఘన్పూర్ – ధర్మారావు పేట మీదుగా ప్రయాణించాలి.
3. పస్రా పోలీస్ స్టేషన్ పరిధి.
పస్రా నుండి ఏటూరునాగారం వెళ్లే మార్గంలో జలగలంచ వాగు వరద ప్రవాహం పెరిగి రహదారి మీదుగా ప్రవాహం ప్రవహిస్తుంది.
డైవర్షన్ రూట్: ఏటూరునాగారం వెళ్లే వారు పస్రా – నార్లపూర్ – మేడారం రోడ్డు మీదుగా మేడారం మార్గం ద్వారా ప్రయాణించాలి.
4. తాడ్వాయి పోలీస్ స్టేషన్ పరిధి.
1. చింతల్ నుండి ఎల్బాక మధ్యలో జంపన్న వాగు వరద ప్రవాహం పెరిగి బ్రిడ్జి మీదుగా ప్రవహిస్తోంది. డైవర్షన్ రూట్: ఎల్బాక, పడిగపూర్ వెళ్లేవారు మేడారం – కొంగలమడుగు మార్గం ద్వారా వెళ్లాలి.
5. ఏటూరునాగారం పోలీస్ స్టేషన్ పరిధి.
1. దొడ్ల నుండి కొండయి మధ్యలో జంపన్న వాగు వరద ప్రవహం పెరిగి రాకపోకలు నిలిచిపోయాయి, కొండయి గ్రామం వెళ్లే వాళ్ళ కోసం పడవ సౌకర్యం కలదు.
2. ఎలిశెట్టిపల్లి నుండి చలిపాక మధ్యలో జంపన్న వాగు వరద ప్రవహం పెరిగి రాకపోకలు నిలిచిపోయాయి, చలిపాక గ్రామం వెళ్లే వాళ్ళ కోసం పడవ సౌకర్యం కలదు


