ములుగు జిల్లాలో గుడుంబా గుప్పుమంటోంది
*పట్టించుకోని ఎక్సైజ్ అధికారులు
కాకతీయ, ఏటూరునాగారం : ములుగు జిల్లా పరిధిలోని ఏటూరునాగారం మండలం & మంగపేట మండలం ప్రాంతాల్లో గుడుంబా తయారీ, విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. గ్రామాల్లో బహిరంగంగానే గుడుంబా అమ్మకాలు జరుగుతున్నా సంబంధిత ఎక్సైజ్ శాఖ అధికారులు మాత్రం పట్టించుకోనట్లుగా వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు.
గుడుంబా సేవనం వల్ల ఆరోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు పెరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అక్రమ మద్యం వ్యాపారంపై కఠిన చర్యలు తీసుకోవాలని, తరచుగా దాడులు నిర్వహించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం చేస్తున్నారని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.


