ఎస్.ఎస్. డిగ్రీ కాలేజీలో ఈనెల 19న భారీ ఉద్యోగ మేళా
కాకతీయ, గీసుగొండ: నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఈనెల 19వ తేదీన ఎస్.ఎస్. డిగ్రీ కాలేజీలో భారీ ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ కొక్కొండ శ్రీకాంత్ వెల్లడించారు. వరంగల్ మహానగర పాలక సంస్థ 16వ డివిజన్ ధర్మారంలోని ఎస్ఎస్ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో టాటా స్ట్రైవ్ సహకారంతో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. పదో తరగతి,ఇంటర్మీడియట్, ఐటిఐ,డిప్లొమా, డిగ్రీ, బి ఫార్మసీ అర్హత కలిగిన అభ్యర్థులు హాజరుకావచ్చని తెలిపారు.అపోలో ఫార్మసీ, ఏ యూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, మహేంద్ర ఆటోమోటివ్ తదితర సంస్థలు ప్రత్యక్ష ఇంటర్వ్యూలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేయనున్నట్లు పేర్కొన్నారు. నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని, పూర్తి వివరాలకు 9963591463 నంబర్‌ను సంప్రదించాలని ప్రిన్సిపాల్ కొక్కొండ శ్రీకాంత్ సూచించారు.


