కాకతీయ, వరంగల్: తెలంగాణలో కురుస్తున్న భారీ వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలన్నీ నీట మునిగాయి. వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పలు ప్రాంతాలన్నీ నీటమునిగాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షానికి వాగులు పొంగిపొర్లుతున్నాయి. ములుగు జిల్లాలోని మేడారం దగ్గర జంపన్న వాగు ఉద్ధ్రుతంగా ప్రవహిస్తుంది. వంతెనను ఆనుకుని వరద ప్రవాహం కొనసాగుతుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


