epaper
Monday, March 2, 2026
epaper

సిరిసిల్ల పీఠంపై గులాబీ జెండా

సిరిసిల్ల పీఠంపై గులాబీ జెండా

జిందం కళా చక్రపాణి వరుసగా రెండోసారి ఎన్నిక
వైస్ చైర్మన్‌గా దార్ల సందీప్‌కు అవకాశం
క్యాంపు రాజకీయాల తర్వాత బీఆర్ఎస్ నిర్ణయం ఖరారు
రాష్ట్రంలో కాంగ్రెస్… సిరిసిల్లలో బీఆర్ఎస్ పాలన కొనసాగింపు
పట్టణ అభివృద్ధి నిధులపై ప్రజల దృష్టి
వైస్ చైర్మన్ ఎంపికపై పార్టీ లోపల అసంతృప్తి చర్చ

కాకతీయ, రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల మున్సిపల్ పీఠంపై గత కొన్ని రోజులుగా కొనసాగిన ఉత్కంఠకు సోమవారం తెరపడింది. మున్సిపల్ చైర్మన్‌గా జిందం కళా చక్రపాణి, వైస్ చైర్మన్‌గా దార్ల సందీప్ ఏకగ్రీవంగా ఎన్నికవడంతో కొత్త పాలకవర్గం బాధ్యతలు స్వీకరించింది. దీంతో సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్ఎస్ మళ్లీ అధికారాన్ని కొనసాగించింది. మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపికపై బీఆర్ఎస్ పార్టీలో తీవ్ర కసరత్తు జరిగింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కేటీఆర్ పర్యవేక్షణలో క్యాంపులో ఉన్న 27 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లతో సుదీర్ఘంగా చర్చలు జరిపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని చివరకు జిందం కళా చక్రపాణిని చైర్మన్‌గా, దార్ల సందీప్‌ను వైస్ చైర్మన్‌గా ఖరారు చేశారు. సోమవారం ఉదయం క్యాంపు నుంచి నేరుగా మున్సిపల్ కార్యాలయానికి చేరుకున్న కౌన్సిలర్లు ముందుగా ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం జరిగిన ఎన్నికలో జిందం కళా చక్రపాణి వరుసగా రెండోసారి చైర్మన్‌గా ఎన్నికయ్యారు. దార్ల సందీప్ వైస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ ఎన్నికతో బీఆర్ఎస్ మూడోసారి సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్‌పై పట్టు సాధించింది.

రాష్ట్రంలో కాంగ్రెస్… పట్టణంలో బీఆర్ఎస్

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ, సిరిసిల్ల మున్సిపాలిటీలో మాత్రం బీఆర్ఎస్ స్పష్టమైన మెజారిటీతో పాలనలో కొనసాగుతోంది. మున్సిపల్ కౌన్సిల్‌లో కాంగ్రెస్‌కు ఆరుగురు కౌన్సిలర్లు, బీజేపీకి ఐదుగురు సభ్యులు, ఒక స్వతంత్ర సభ్యుడు ఉన్నారు. ఈ రాజకీయ సమీకరణాల మధ్య బీఆర్ఎస్ మున్సిపల్ పాలన కొనసాగించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సిరిసిల్ల పట్టణంలో రహదారులు, డ్రైనేజీ, తాగునీటి సరఫరా, వీధి దీపాలు, పట్టణ సుందరీకరణ వంటి అభివృద్ధి పనులకు రాష్ట్ర ప్రభుత్వ నిధులు కీలకం. రాష్ట్రంలో కాంగ్రెస్, పట్టణంలో బీఆర్ఎస్ పాలన కొనసాగుతున్న నేపథ్యంలో అభివృద్ధి పనులకు నిధుల సాధనపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. రాజకీయ భేదాలు పక్కనపెట్టి పట్టణ అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలని స్థానికులు కోరుతున్నారు.

వైస్ చైర్మన్ ఎంపికపై అసంతృప్తి

వైస్ చైర్మన్ ఎంపికపై పార్టీ లోపల వివాదం తలెత్తింది. క్యాంపులో బుర్ర నారాయణ గౌడ్ పేరును పరిశీలించినట్లు ప్రచారం జరిగినప్పటికీ, తుదకు దార్ల సందీప్‌ను వైస్ చైర్మన్‌గా ఎంపిక చేయడం కొందరిలో అసంతృప్తికి దారితీసింది. తనను పక్కనపెట్టారని భావించిన బుర్ర నారాయణ గౌడ్ పార్టీ అధిష్టానం నిర్ణయంపై అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. పదవుల పంపిణీలో సమీకరణాలు ప్రభావం చూపుతున్నాయన్న అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఈ పరిణామం బీఆర్ఎస్‌లో అంతర్గత అసంతృప్తికి దారి తీస్తుందా లేక నాయకత్వం త్వరలోనే స్పష్టత ఇస్తుందా అన్నది ఆసక్తికరంగా మారింది. వరుసగా రెండోసారి చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన జిందం కళా చక్రపాణికి పట్టణ అభివృద్ధి, నిధుల సాధన ప్రధాన సవాలుగా మారగా, కొత్త పాలకవర్గం పనితీరుపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img