epaper
Monday, March 2, 2026
epaper

వర్ధన్నపేట మునిసిప‌ల్‌ చైర్మన్‌గా సారంగపాణి

వర్ధన్నపేట మునిసిప‌ల్‌ చైర్మన్‌గా సారంగపాణి
కాంగ్రెస్ ఖాతాలో మున్సిపల్ పీఠం
రాజకీయ ఉత్కంఠకు తెర
చైర్మన్‌గా పాలకుర్తి సారంగపాణి ఏకగ్రీవ ఎన్నిక
వైస్ చైర్మన్‌గా స్వతంత్ర అభ్యర్థి నేతవత్ షీబారాణి
ప్రత్యేక సమావేశంలో అధికారికంగా ప్రకటించిన ఎన్నికల అధికారులు

కాకతీయ, వరంగల్ ప్రతినిధి : వర్ధన్నపేట మున్సిపాలిటీలో కొనసాగిన రాజకీయ ఉత్కంఠకు తెరపడింది. సోమవారం జరిగిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ పీఠాన్ని కైవసం చేసుకుంది. చైర్మన్‌గా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పాలకుర్తి సారంగపాణి, వైస్ చైర్మన్‌గా స్వతంత్ర అభ్యర్థి నేతవత్ శీబా రాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఎన్నికల అధికారులు ఈ నియామకాలను అధికారికంగా ప్రకటించారు. కాంగ్రెస్ తరఫున పాలకుర్తి సారంగపాణి పేరును కౌన్సిలర్లు ప్రతిపాదించగా, మెజారిటీ సభ్యులు మద్దతు తెలపడంతో ఆయన చైర్మన్‌గా ఎన్నికయ్యారు. రాజకీయ సమీకరణాల్లో భాగంగా స్వతంత్ర అభ్యర్థి నేతవత్ శీబా రాణికి వైస్ చైర్మన్ పదవి దక్కింది.

అభివృద్ధే లక్ష్యం : సారంగపాణి

పదవీ బాధ్యతలు స్వీకరించిన అనంతరం చైర్మన్ పాలకుర్తి సారంగపాణి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించిన పార్టీ నాయకత్వానికి, కౌన్సిలర్లకు కృతజ్ఞతలు తెలిపారు. వర్ధన్నపేట పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని, ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి రాజీ పడబోమని స్పష్టం చేశారు. వైస్ చైర్మన్ నేతవత్ శీబా రాణి మాట్లాడుతూ పట్టణ అభివృద్ధికి అందరితో సమన్వయంతో పని చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, మున్సిపల్ అధికారులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన చైర్మన్, వైస్ చైర్మన్‌లకు శుభాకాంక్షలు తెలిపారు. వర్ధన్నపేట మున్సిపల్ పీఠాన్ని కాంగ్రెస్ దక్కించుకోవడంతో స్థానిక రాజకీయాల్లో కొత్త సమీకరణాలు ప్రారంభమైనట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

వర్ధన్నపేట వైస్ చైర్మన్ నేతవత్ షిబారాణి స్వతంత్ర అభ్యర్థిని

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..?

కొమ్మాల జాతరకు ఉత్సవ కమిటీ ఉన్నట్టా… లేనట్టా..? చైర్మన్ లేకుండానే కొనసాగుతున్న బ్రహ్మోత్సవాలు జాతర...

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం..

కొమ్మాల జాతరను విజయవంతం చేద్దాం.. *ముదిరాజ్ మహాసభ మండల అధ్యక్షుడు కొత్తగట్టు రాజేందర్...

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం

కమలాపూర్‌లో ఘెర రోడ్డు ప్ర‌మాదం డివైడర్‌ను ఢీకొట్టి బైక్‌.. ఇద్ద‌రు దుర్మ‌ర‌ణం శనిగరం గ్రామంలో...

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..!

చెన్నారావుపేటలో బీఆర్ఎస్‌కు బిగ్ షాక్..! మేజర్ గ్రామ సర్పంచ్ సహా నేతల కాంగ్రెస్‌లో...

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు

ప్రభబండ్ల నిర్వాహకులకు మార్గదర్శకాలు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు డీసీపీ అంకిత్ హెచ్చరిక కాకతీయ,గీసుగొండ:...

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..!

ఎమ్మెల్యే ఆదేశాలు.. కాంట్రాక్టర్ బేఖతార్..! కొమ్మాల జాతరలో భద్రతపై నిర్లక్ష్యం? బావులకు కాంక్రీట్ గోడలు...

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..!

ప్ర‌భ‌ల బ‌లాబ‌లాలు..! కొమ్మాల జాతరకు సిద్ధమవుతున్న ప్రభల పందెం! ప్రదర్శనకు పార్టీల పోటాపోటీగా బండ్ల...

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే

న్యూ కౌటిల్యాస్ సెయింట్ ఆమెన్ హైస్కూల్లో సైన్స్ డే కాకతీయ, వరంగల్ సిటీ...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img