కిటకిటలాడిన శివాలయాలు
కాకతీయ, జమ్మికుంట: జమ్మికుంట మండలంలోని శివాలయాలు కిటకిటలాడుతున్నాయి. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. ఉదయం నుంచే భక్తులు శివపర్వాతులను దర్శనం చేసుకుంటున్నారు. జమ్మికుంట బొమ్మలాగుడిలో (శివాలయంలో) తెల్లవారుజామున నుండే భక్తులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. మహాశివునికి అత్యంత ప్రీతిపదమైన రోజు కావడంతో, భక్తి శ్రద్ధలతో జాగారం చేస్తూ శివానామస్మరణ తో ఉపవాసం ఉంటూ మహాశివునికి కృపకు పాత్రులువ్వుతారు.


