epaper
Monday, March 2, 2026
epaper

చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ

చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ

అనుభవానికి ప్రాధాన్యం ఇస్తారా ?

కొత్త ముఖానికి అవకాశం కల్పిస్తారా ?

కేటీఆర్ నిర్ణ‌యం కోసం ఎదురుచూపులు

సిరిసిల్లలో 39 వార్డుల‌కు బీఆర్ఎస్‌కు 27..

ఈసారి చైర్మ‌న్ పీఠం జనరల్ మహిళకు రిజర్వేషన్

నలుగురు కౌన్సిలర్ల మధ్య టఫ్ వార్

వైస్ చైర్మన్ కోసం యువ, సీనియర్ల మధ్య గ‌ట్టి పోటీ

కొన్ని గంటల్లోనే తేలనున్న భవితవ్యం

కాకతీయ, రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నిక సోమవారం జరగనున్న నేపథ్యంలో పట్టణ రాజకీయాలు వేడెక్కాయి. గతంలో బీసీ మహిళగా ఉన్న చైర్మన్ రిజర్వేషన్ ఈసారి జనరల్ మహిళకు కేటాయించారు. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం 39 వార్డుల్లో బీఆర్ఎస్ 27 స్థానాలు గెలుచుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. కాంగ్రెస్ 6, బీజేపీ 5, స్వతంత్రులు ఒక స్థానాన్ని దక్కించుకున్నారు. సంఖ్యా బలం దృష్ట్యా చైర్మన్ పదవి బీఆర్ఎస్ ఖాతాలోకి వెళ్లడం ఖాయమే అయినప్పటికీ, ఎవరికీ అవకాశం దక్కుతుందన్నది ఆస‌క్తిక‌రంగా మారింది. సిరిసిల్ల మున్సిపాలిటీగా ఏర్పడినప్పటి నుంచి చైర్మన్ పదవి బీసీవర్గానికే కేటాయించారు. ఒకసారి బీసీ జనరల్, ఐదుసార్లు బీసీ మహిళ కేటగిరీలకు రిజర్వేషన్ లభించింది. పట్టణంలో బీసీవర్గాలు, ముఖ్యంగా పద్మశాలీల ప్రాబల్యం ఎక్కువగా ఉండటంతో ఈ విధంగా రిజర్వేషన్ కొనసాగింది. ఈసారి జనరల్ మహిళకు రిజర్వేషన్ కేటాయించడంతో ఇతర వర్గాలకు చెందిన మహిళా కౌన్సిలర్లకు అవకాశం లభించింది.

రేసులో నలుగురు కౌన్సిలర్లు

చైర్‌ప‌ర్స‌న్ పీఠం కోసం నలుగురు మహిళా కౌన్సిలర్లు రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. 3వ వార్డు నుంచి కౌన్సిలర్ గా గెలిచిన జిందం కళా చక్రపాణి, 5వ వార్డు నుంచి గెలిచిన దార్ణం అరుణ లక్ష్మీనారాయణ,
17వ వార్డు నుంచి గెలిచిన గుండ్లపెల్లి నీరజ పూర్ణచందర్, 30వ వార్డు నుంచి గెలిచిన మంచె రేణుక శ్రీనివాస్ మధ్య టఫ్ ఫైట్ నడుస్తున్నట్లు సమాచారం. జిందం కళా చక్రపాణి ఇప్పటికే వరుసగా రెండుసార్లు చైర్మన్‌గా పనిచేసిన అనుభవం ఉండటం ఆమెకు బలంగా మారింది. పరిపాలనలో అనుభవం ఉన్న అభ్యర్థిగా ఆమెకు మద్దతు లభిస్తుందన్న ప్రచారం సాగుతోంది. గుండ్లపెల్లి నీరజ పూర్ణచందర్ కుటుంబానికి మున్సిపల్ రాజకీయాల్లో ప్రత్యేక గుర్తింపు ఉండటం, గతంలో తన భర్త పూర్ణచందర్ తల్లి గుండ్లపెల్లి సరోజన చైర్మన్‌గా సేవలు అందించిన అంశం ఆమె వర్గం ప్రస్తావిస్తోన్నట్లు తెలిసింది. మంచె రేణుక శ్రీనివాస్ కుటుంబానికి గత పాలకవర్గంలో వైస్ చైర్మన్ పదవి ఉన్న నేపథ్యంలో ఈసారి చైర్మన్ పీఠం తమకే రావాలన్న వాదన వినిపిస్తోంది. దార్ణం అరుణ లక్ష్మీనారాయణ కూడా గట్టిగానే ప్రయత్నాలు కొనసాగిస్తున్నట్లు సమాచారం.

వైస్ చైర్మన్ పీఠానికి పోటీ

చైర్మన్ ఎన్నికతోపాటు వైస్ చైర్మన్ పదవిపై కూడా పోటా పోటీ నెలకొంది. యువ కౌన్సిలర్లకు అవకాశం ఇవ్వాలన్న అభిప్రాయం ఒకవైపు వినిపిస్తుండగా, అనుభవజ్ఞులైన సీనియర్ సభ్యులు కూడా తమ హక్కు ఉందని భావిస్తున్నారు. గత పాలకవర్గంలో కీలక పాత్ర పోషించిన సభ్యులు ఈసారి ఉన్నత పదవిని ఆశిస్తున్నారు.

క్యాంపులో కౌన్సిలర్లు

మున్సిపల్ ఫలితాల అనంతరం బీఆర్ఎస్ తరపున గెలిచిన కౌన్సిలర్లు అందరినీ ముందు జాగ్రత్త చర్యగా పార్టీ అధిష్టానం క్యాంపున‌కు తరలించింది. అక్కడే చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక కోసం కౌన్సిలర్లతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కేటీఆర్ చర్చలు జరిపినట్లు సమాచారం. అధికారికంగా ఏమీ ప్రకటించకపోయినా పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు ఏకగ్రీవ ఎన్నిక జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. చైర్మన్ ఎవరు అనేది డిసైడ్ చేయడంలో కేటీఆర్ కీలక పాత్ర పోషిస్తుండడంతో ఆయన నిర్ణయంపై జిల్లా రాజకీయ వర్గాలు, పార్టీ కార్యకర్తలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సోమవారం జరగనున్న ఎన్నిక ఫలితం సిరిసిల్ల మున్సిపల్ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తోందన్న చర్చ జరుగుతోంది. అనుభవానికి ప్రాధాన్యం ఇస్తారా? లేక కొత్త ముఖానికి అవకాశం కల్పిస్తారా? పార్టీ అధిష్టానం ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందన్నదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

అంబేద్కర్ విగ్రహ ధ్వంసం… కఠిన చర్యలకు డిమాండ్

అంబేద్కర్ విగ్రహ ధ్వంసం… కఠిన చర్యలకు డిమాండ్ కాకతీయ, జగిత్యాల: జగిత్యాల పట్టణంలోని...

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img