కత్తితో దాడి ఘటనలో ఒకరికి తీవ్ర గాయాలు
కాకతీయ, దుగ్గొండి: క్షినీకావేశంలో కత్తితో దాడి చేయడంతో ఒకరికి తీవ్ర గాయలైన ఘటన దుగ్గొండి మండలం జీడికల్ లో ఆదివారం జరిగింది. గ్రామానికి చెందిన గొర్రె రమేష్ అదే గ్రామానికి చెందిన గొర్రె యుగేందర్ ఆర్థిక లావాదేవీల విషయంలో గ్రామ పెద్దల సమక్షంలో పంచాయితీ జరుగుతుండగా మాట మాట పెరిగి కోపోద్రికుడైన యుగేందర్ కుమారుడు రాకేష్ తన చేతిలో ఉన్న కీ చైన్ కత్తితో రమేష్ పై దాడి చేయగా చెంప, పెదవిపై తీవ్ర గాయాలై రక్తస్రావమైంది. రమేష్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రణధీర్ తెలిపారు.


