epaper
Thursday, January 15, 2026
epaper

దేశానికే ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం

దేశానికే ఆదర్శంగా తెలంగాణను తీర్చిదిద్దుతాం
త్వరలో రూ.33 కోట్ల చేనేత రుణాల మాఫీ
నేతన్న బీమా పథకాల పంపిణీలో మంత్రి తుమ్మల నాగేశ్వ‌ర రావు
చేనేత, పవర్ రూం కార్మికులను ఆదుకోవడానికి ప్రత్యేక చర్యలు: మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ బ్యూరో: దేశానికే ఆదర్శంగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కే కన్వెన్షన్ హల్ లో నిర్వహించిన నేతన్న పొదుపు, నేతన్న బీమా పథకాల పంపిణీ కార్యక్రమానికి రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, చేనేత, జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజారామయ్యర్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ మహేష్ బిగితే లతో కలిసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ పదేళ్లుగా ఉన్న బకాయిలను ప్రజా ప్రభుత్వం విడుదల చేస్తుందని, నేత కార్మికుల కోరిక మేరకు లక్ష రూపాయల రుణ మాఫీ వర్తింప చేస్తున్నామని, రూ.33 కోట్ల చేనేత రుణాలను రాబోయే క్యాబినెట్ సమావేశంలో మాఫీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు. వేములవాడలో నూలు డిపో ఏర్పాటు చేసి ఇప్పటి వరకు 2500 మెట్రిక్ టన్నుల నూలు 100 సోసైటీలకు సరఫరా చేయడం జరిగిందని వెల్లడించారు. నేతన్న చేయూత, నేతన్న పొదుపు, నేతన్న బీమా వంటి అనేక పథకాల బకాయిలను జమ చేస్తున్నామన్నారు. ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికరంగా ఉన్నా పేద ప్రజలపై పన్నుల భారం మోపకుండా ఎన్నికల సమయంలో ఇచ్చిన ఒక్కో హామీ అమలు చేస్తున్నామని, మహిళల ఉచిత ప్రయాణానికి 6680 కోట్ల రూపాయలు చెల్లించిందని, మహిళలకు 200 కోట్ల జీరో టికెట్లు జారీ చేశామని, మనల్ని చూసి పక్క రాష్ట్రాలు కూడా ఈ పథకాన్ని అమలు చేస్తున్నాయని అన్నారు.

సన్న వడ్లు పండించే రైతులకు క్వింటాళ్ల 500 రూపాయల బోనస్ ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని, పేదలకు రేషన్ ద్వారా సన్న బియ్యం సరఫరా చేస్తున్నామని, ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహకాలతో దేశంలో 2 కోట్ల 80 లక్షల ట్రిప్ టన్నుల ధాన్యం పండిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచిందని మంత్రి తెలిపారు. వస్త్ర పరిశ్రమలు ఆధునిక సాంకేతికతను పెంచేందుకు హ్యాండ్లూమ్ యూనివర్సిటీ (ఐ.ఐ.ఐహెచ్.టి) ఏర్పాటుకు కృషి చేస్తున్నామని, మహిళలు గౌరవంగా స్వీకరించేలా నాణ్యమైన చీరలు తయారు చేయాలని 450 రూపాయలు ఒక్క చీరపై ఖర్చు చేస్తూ 65 లక్షల మంది మహిళా సంఘాల సభ్యులకు రెండు చీరలు చొప్పున పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.

అనంతరం సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ.. చేనేత పవర్ రూం కార్మికులను ఆదుకోవాలని ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చర్యలు చేపట్టారని, ప్రభుత్వం ఆర్థిక స్థితిగతులను బాగు చేస్తూ దేశంలో ఎక్కడా లేని విధంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. విద్య పై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్ధ పెట్టారని, ఉస్మానియా యూనివర్సిటీని ప్రత్యేకంగా అభివృద్ధి చేసేందుకు నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. 6 నుంచి ఇంటర్ వరకు సంక్షేమ గృహాల్లో చదివే పిల్లలకు నాణ్యమైన ఆహారం అందించేందుకు డైట్ చార్జీలు పెంచామని, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో 25 ఎకరాల విస్తీర్ణంలో 200 కోట్ల వ్యయంతో యంగ్ ఇండియా సమీకృత గురుకులాల నిర్మాణం జరుగుతుందని తెలిపారు. అనంత‌రం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ధార్మిక కార్మిక క్షేత్రం రాజన్న సిరిసిల్ల జిల్లాను అన్ని రకాలుగా అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వం లో ప్రజా ప్రభుత్వం చర్యలు చేపట్టిందని అన్నారు.

నేత కార్మికుల కష్టాలు తీర్చేందుకు ప్రజా ప్రభుత్వం పలు చర్యలు చేపట్టిందని అన్నారు. వస్త్ర పరిశ్రమలో 352 కోట్ల రూపాయల బకాయిలను రేవంత్ సర్కార్ చెల్లించిందని అన్నారు. చేనేత కార్మికులకు పని కల్పించాలనే లక్ష్యంతో 270 కోట్ల రూపాయల విలువ గల బట్ట ఉత్పత్తి ఆర్డర్లను ప్రభుత్వం అందించిందని వెల్లడించారు. చేనేత జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యార్ మాట్లాడుతూ సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ కార్మికులకు చేతినిండా పని కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రభుత్వ శాఖల ఆర్డర్లను ఇప్పిస్తుందని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి కింద ఉత్పత్తి చేసే ఆర్డర్లతో ఒక్కో కార్మికుడికి నెలకు 20 వేల నుంచి 25 వేల వరకు ఆదాయం వస్తుందని వివరించారు. ఆర్డర్లు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ గౌడ్, సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు, చేనేత జౌళి శాఖ జేడీ ఎన్వీ రావు, ఏడీ రాఘవరావు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, నేత కార్మికులు, స్థానిక నాయకులు,అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం

బీఆర్ఎస్‌కు ట‌ఫ్ టైం ఖ‌మ్మంలో పార్టీని నిల‌బెట్టేది ఎవ‌రు..? మాజీమంత్రినా..? మాజీ ఎంపీనా..? కారు దిగిపోతున్న...

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం

జర్నలిస్టులకు అండగా ప్రజా ప్రభుత్వం అక్రిడిటేషన్లు తగ్గవు… మరింత పెరుగుతాయి జీవో–252లో మార్పులు, సూచనలకు...

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్

ఇరాన్ ఆంక్షల దెబ్బ… బాస్మతి ఎగుమతులకు బ్రేక్ అమెరికా ఆంక్షలతో ఇరాన్ ఆర్థిక...

జంక్ష‌న్లు జామ్‌

జంక్ష‌న్లు జామ్‌ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ 6 కిలోమీటర్ల మేర నిలిచిపోయిన...

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌

మూసీ ప్రాజెక్టుతో రియ‌ల్ బూమ్‌ ప్రాపర్టీ ధరలు హైక్ ! దాదాపు 15 నుండి...

క‌థ‌నం క‌ల‌క‌లం !

క‌థ‌నం క‌ల‌క‌లం ! ఐఏఎస్ అధికారికి, మంత్రికి మధ్య వివాహేతర బంధం ? అత్యంత...

విష‌మిచ్చి చంపండి

విష‌మిచ్చి చంపండి ఇప్ప‌టికే స‌గం చ‌నిపోయా మహిళా అధికారులను వివాదాల్లోకి లాగొద్దు రేటింగ్స్ కోసం మానసిక...

వివాదాలొద్దు

వివాదాలొద్దు ప‌క్క రాష్ట్రాల‌తో చ‌ర్చ‌ల‌కు సిద్ధం ప‌ర‌స్ప‌ర స‌హ‌కారంతో ముందుకుసాగుదాం ప్రపంచ నగరాలతో హైదరాబాద్ పోటీ 2034...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...

రేవంత్ కు కొత్త సవాల్!

* సర్కార్ కు పరీక్షగా సీఎస్ ఎంపిక? * ఈ నెలాఖరున రామకృష్ణారావు...

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం

బాటసింగారంలో భారీగా గంజాయి స్వాదీనం కాక‌తీయ‌, హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లాలోని బాటసింగారంలో...

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన

పంటల వివరాల నమోదులో ‘సర్ డాటా’ వినియోగానికి యూనివర్సిటీ ప్రతిపాదన ప్రతిపాదించిన ప్రాజెక్టుపై...

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా

నాలుగోరోజు కూడా ఎలాంటి చర్చా లేకుండానే పార్లమెంట్ వాయిదా న్యూ డిల్లీ జూలై...

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు

ప్రశ్నిస్తే పగబట్టినట్టుగా అన్నీ వర్గాలపై ఆంక్షలు మొన్న యూనివర్సిటీల్లో ఆందోళనలు నిషేధిస్తూ మెమో నేడు...

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌

రాష్ట్రంలో హద్దులు దాటిపోతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ కాంగ్రెస్‌ దూత ఫోన్‌ ట్యాపింగ్‌..! గాంధీ...
spot_img

Popular Categories

spot_imgspot_img