తాటి చెట్టుపై నుండి పడి గీత కార్మికుడి మృతి
కాకతీయ, జమ్మికుంట: వీణవంక మండలం కొండపాక గ్రామానికి చెందిన గట్టు ఐలయ్య గౌడ్ వృత్తిలో భాగంగా తాటి చెట్టు ఎక్కడానికి వెళ్లి ప్రమాదవశాత్తు శనివారం చెట్టుపై పడి మరణించాడు. మృతుడికి భార్య ఇద్దరు కొడుకులు, కూతురు ఉన్నారు. కుటుంబానికి పెద్దదిక్కు అయిన గట్టు ఐలయ్య చనిపోవడంతో కుటుంబ సభ్యులు శోకసముద్రంలో మునిగారు. విషయం తెలుసుకున్న వీణవంక ఎస్సై సంఘటన స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.


