epaper
Monday, March 2, 2026
epaper

నగర ప్రజల పక్షాన రాజీలేని పోరు

నగర ప్రజల పక్షాన రాజీలేని పోరు

కాంగ్రెస్–బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం

బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లహరి శంకర్

కాకతీయ, కరీంనగర్ : నగర పాలకసంస్థ ఎన్నికల తీర్పును గౌరవిస్తూ, బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా ప్రజల సమస్యలపై రాజీ పడకుండా పోరాటం కొనసాగిస్తామని బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లహరి శంకర్ తెలిపారు. శనివారం కరీంనగర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
నగర ప్రజల తీర్పును శిరసావహిస్తున్నామని, తమకు మద్దతు తెలిపిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు. కార్పొరేషన్‌లో బీజేపీ గెలిచిన 30 సీట్లలో 11 మంది మాజీ బీఆర్ఎస్ నేతలే ఉన్నారని పేర్కొన్నారు. ఇతర పార్టీల నేతలను చేర్చుకుని సాధించిన విజయాన్ని నైతిక విజయంగా చెప్పలేమని విమర్శించారు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని ఇతర మున్సిపాలిటీల్లో బీజేపీ పరాజయం పాలవడం కేంద్ర మంత్రి బండి సంజయ్ వైఫల్యమని అన్నారు. మేయర్ ప్రమాణ స్వీకారానికి ముందే నగర అభివృద్ధిపై స్పష్టమైన హామీ ఇవ్వాలని బండి సంజయ్‌ను డిమాండ్ చేశారు. గత పదేళ్లుగా బీఆర్ఎస్‌పై అవినీతి ఆరోపణలు చేసిన వారు, అదే పార్టీకి చెందిన వారిని బీజేపీలో చేర్చుకోవడం ఎలా సాధ్యమైందో వివరించాలని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఒక్కో అభ్యర్థి భారీగా ఖర్చు చేశారని ఆరోపిస్తూ, ఆ నిధుల మూలాలను ప్రజలకు వెల్లడించాలని కోరారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్–బీజేపీ మధ్య లోపాయికారీ ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. మాజీ మంత్రి గంగుల కమలాకర్ హయాంలో అక్రమాలపై ఫిర్యాదులు స్వీకరిస్తామని ప్రకటించారని గుర్తుచేస్తూ, ఇప్పుడు బీజేపీ కార్పొరేటర్ల విషయంలో అలాంటి హామీ ఇవ్వగలరా అని ప్రశ్నించారు. డివిజన్లలో బీఆర్ఎస్ అభ్యర్థులను లేకుండా చేస్తానని చేసిన వ్యాఖ్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని అన్నారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్ జక్కని ఉమాపతి, బీఆర్ఎస్ నగర ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు చేతి చంద్రశేఖర్, తొంటి రాజేందర్, రాచకొండ నరేష్, అనుమల్ల ఉమాశంకర్, దూలం సంపత్ గౌడ్, నాగుల కిరణ్ కుమార్ గౌడ్, దుర్గం శ్రీకాంత్ గౌడ్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..!

వేములవాడ ఏఎస్పీకి ఆకస్మిక బదిలీ..! రెండు నెలల్లోనే రుత్విక్ సాయి ట్రాన్స్‌ఫర్ డీఎస్పీగా శ్రీనివాసులు...

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు

సర్కారు భూముల కబ్జాలపై కఠిన చర్యలు ఆక్రమణలు తొలగించి పేదలకు పంపిణీ ధర్మారంలో క్రీడా...

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం

ఎమ్మెల్యే వ్యాఖ్యలపై రజక సంఘాల ఆగ్రహం కరీంనగర్‌లో వీర్లపల్లి శంకర్ దిష్టిబొమ్మ దహనం బాధిత...

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు

లక్ష్మీనరసింహస్వామి కళ్యాణంలో కలెక్టర్ దంపతులు పట్టు వస్త్రాలు సమర్పణ కాక‌తీయ‌, జగిత్యాల : ధర్మపురి...

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం

హుజూరాబాద్‌లో బీఆర్‌ఎస్ భూస్థాపితం ఖాయం కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి ప్రణవ్ కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు,...

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు

బండి సంజయ్ ధర్మం తప్పుతున్నారు బీఆర్‌ఎస్ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్ రెబల్స్ చేరిక,...

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా

50వ డివిజన్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా కార్పొరేటర్ బోయినపల్లి ప్రవీణ్ రావు కాక‌తీయ‌, కరీంనగర్ :...

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి

సైన్స్‌పై మ‌క్కువ పెంచుకోవాలి ప్రశ్నించేత‌త్వం అల‌వ‌ర్చుకోవాలి రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కాకతీయ, రుద్రంగి:...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img