epaper
Sunday, March 1, 2026
epaper

ప్రజా ప్రభుత్వానికి ప్రజల ఆమోద ముద్ర

ప్రజా ప్రభుత్వానికి ప్రజల ఆమోద ముద్ర
◆ మున్సిపల్ ఫలితాలు ప్రజల విశ్వాసానికి నిదర్శనం
◆ సీఎం రేవంత్ నాయకత్వానికి ప్రజల మద్దతు
◆ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలకే విజయ ఫలితం
◆ తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాం : మంత్రి దుద్దిళ్ల‌

కాకతీయ, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రెండేళ్ల ప్రజా ప్రభుత్వ పాలనకు ప్రజలు ఇచ్చిన ఆమోద ముద్ర అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఇది కేవలం రాజకీయ గెలుపు మాత్రమే కాదని, సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న విశ్వాసానికి స్పష్టమైన నిదర్శనమని తెలిపారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో మంత్రి ఈ మేరకు స్పందించారు. ప్రజల ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకే ఈ విజయాలు ప్రతిఫలమని మంత్రి పేర్కొన్నారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేలా ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు.

ప్రజల విశ్వాసమే కాంగ్రెస్ బలం
స్వార్థ రాజకీయాల కోసం తెలంగాణ బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బతీయాలని ప్రయత్నించిన శక్తులకు ఈ ప్రజా తీర్పు గట్టి సమాధానమని మంత్రి వ్యాఖ్యానించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టడమే కాకుండా అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజల చెంతకు తీసుకెళ్లాలన్న ప్రభుత్వ సంకల్పానికి ఈ ఫలితాలు నిదర్శనమన్నారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, అదే ప్రజల మద్దతుకు కారణమైందన్నారు. ఈ విజయంతో ప్రభుత్వంపై బాధ్యత మరింత పెరిగిందని మంత్రి పేర్కొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను దశల వారీగా అమలు చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిపే దిశగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని తెలిపారు. అభివృద్ధికి పట్టం కట్టిన ప్రజలకు మంత్రి శ్రీధర్ బాబు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఏఐసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ మార్గనిర్దేశనంలో, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ నాయకత్వంలో ఎన్నికల్లో విజయం కోసం కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ప్రజల విశ్వాసాన్ని మరింత బలపరిచేలా ప్రభుత్వం పారదర్శక పాలన అందించేందుకు కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img