దొంగల కదలికలపై నిఘా…
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
వరుస చోరీల నేపథ్యంలో సీఐ విశ్వేశ్వర్ హెచ్చరిక
అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలి
కాకతీయ, గీసుగొండ : పరిసర ప్రాంతాల్లో వరుస దొంగతనాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ సూచించారు. ఇళ్లు, దుకాణాలను తప్పనిసరిగా తాళం వేసి వెళ్లాలని, నగదు, బంగారం వంటి విలువైన వస్తువులను భద్రమైన ప్రదేశాల్లో ఉంచుకోవాలని తెలిపారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా వాహనాలు కనిపించిన వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. వేసవి సెలవుల సమయంలో ఇళ్లను మూసి ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు ఇంటి భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సమీప పోలీస్ స్టేషన్‌కు ముందస్తు సమాచారం అందించాలని సూచించారు. సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, ఇంటి తాళాలను జాగ్రత్తగా ఉంచుకోవడం వంటి చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రజల భద్రత కోసం పోలీసులు సర్ప్రైజ్ వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారని, ప్రజలు సహకరిస్తేనే దొంగతనాలను అరికట్టడం సాధ్యమవుతుందని సీఐ స్పష్టం చేశారు


