ఇనుగుర్తి డీటీఎఫ్ మండలాధ్యక్షుడిగా యుగంధర్
కాకతీయ, ఇనుగుర్తి : డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (డీటీఎఫ్) ఇనుగుర్తి మండల నూతన కమిటీని శుక్రవారం ఎన్నికల ప్రధాన అధికారి మండల రాజు, ఎన్నికల పరిశీలకులు మద్ది మాధవ్ ఆధ్వర్యంలో ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడిగా పి. యుగంధర్, ఉపాధ్యక్షులుగా రాజసులోచన, ప్రధాన కార్యదర్శిగా ఆడేపు రమేష్, కార్యదర్శులుగా ఎండి మహమూద్, సాయికుమార్, సాగర్, జిల్లా కౌన్సిలర్‌గా మాధవ్, కమిటీ సభ్యుడిగా పి. ఉత్తేజ్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా నూతన మండల అధ్యక్షుడు యుగంధర్, ఎన్నికల అధికారి మండల రాజు, పరిశీలకులు మద్ది మాధవ్ మాట్లాడుతూ ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పిఆర్సి నివేదికను ప్రకటించి, వెంటనే అమలు చేయాలని కోరారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం పొందేందుకు ఇబ్బందులు పడుతున్నారని, అందరికీ హెల్త్ కార్డులు మంజూరు చేసి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.


