తెలంగాణలో ఖాతా తెరిచిన జనసేన
నేరేడుచర్ల 14వ వార్డులో తొలి విజయం
కాకతీయ, తెలంగాణ బ్యూరో : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో జనసేన పార్టీ ఖాతా తెరిచింది. నల్గొండ జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ 14వ వార్డులో జనసేన అభ్యర్థి విజయం సాధించారు. రాష్ట్రవ్యాప్తంగా 200కు పైగా వార్డుల్లో పోటీ చేసిన జనసేనకు ఇది తొలి విజయం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. హోరాహోరీగా సాగిన పోటీలో సమీప ప్రత్యర్థిపై గెలిచి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. ఈ విజయంతో తెలంగాణలో పార్టీ బలోపేతానికి ఊతమిస్తుందని నాయకులు భావిస్తున్నారు.


