epaper
Monday, March 2, 2026
epaper

వడ్దేపల్లిలో సంచలనం…

వడ్దేపల్లిలో సంచలనం…
మునిసిపాలిటీపై ఎగిరిన‌ ఫార్వర్డ్ బ్లాక్ జెండా!
8 వార్డుల్లో ఘన విజయం సాధించిన ఏఐఎఫ్‌బీ
కాంగ్రెస్, బీఆర్‌ఎస్ చెరో స్థానానికి పరిమితం
కల్వకుంట్ల కవిత ప్రచారం హాట్‌టాపిక్
పెద్ద పార్టీలకు షాక్ ఇచ్చిన చిన్న పార్టీ
స్థానిక నాయకత్వం, వ్యూహం ఫలితం
రాష్ట్రవ్యాప్తంగా రాజకీయ చర్చకు దారితీస్తున్న‌ తీర్పు

కాకతీయ, తెలంగాణ బ్యూరో : మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌లో వడ్దేపల్లి మున్సిపాలిటీ సంచలన ఫలితాన్ని నమోదు చేసింది. మొత్తం 10 వార్డులు ఉన్న ఈ మున్సిపాలిటీలో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్‌బీ) అభ్యర్థులు ఎనిమిది వార్డుల్లో ఘన విజయం సాధించి మున్సిపాలిటీని పూర్తిగా కైవసం చేసుకున్నారు. ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్ చెరో ఒక్క స్థానానికి మాత్రమే పరిమితమవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. చిన్న పార్టీగా ఉన్న ఏఐఎఫ్‌బీ ఈ స్థాయిలో ఆధిపత్యం ప్రదర్శించడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఏఐఎఫ్‌బీ అభ్యర్థులకు మద్దతు తెలుపుతూ ప్రచారం నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏఐఎఫ్‌బీ అభ్యర్థుల విజయాన్ని రాజకీయ వర్గాలు ప్రత్యేకంగా విశ్లేషిస్తున్నాయి. ప్రధాన పార్టీలను పక్కనబెట్టి ప్రజలు ఫార్వర్డ్ బ్లాక్‌కు మద్దతు తెలపడం స్థానిక రాజకీయ సమీకరణాల్లో కీలక మార్పులకు సంకేతంగా భావిస్తున్నారు.

స్థానిక బలం… విజయానికి బాట

వడ్దేపల్లిలో ఏఐఎఫ్‌బీ అభ్యర్థులు స్థానిక సమస్యలపై దృష్టి సారిస్తూ ప్రచారం నిర్వహించారు. తాగునీరు, రోడ్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి అంశాలను ప్రధానంగా తీసుకుని ప్రజలతో నేరుగా మమేకమయ్యారు. ప్రధాన పార్టీలలో అంతర్గత విభేదాలు, అసంతృప్తి కూడా ఏఐఎఫ్‌బీకి అనుకూలంగా మారినట్లు రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. కొంతమంది స్థానిక నాయకులు ప్రధాన పార్టీలకు దూరమై ఫార్వర్డ్ బ్లాక్ గుర్తుపై పోటీ చేయడం కూడా ఫలితాలపై ప్రభావం చూపింది. పార్టీ గుర్తు కంటే వ్యక్తిగత ఇమేజ్, స్థానిక నాయకత్వంపై ప్రజలు విశ్వాసం ఉంచినట్లు ఈ ఫలితం స్పష్టంచేసింది.

రాష్ట్రవ్యాప్తంగా చర్చ..!

ఏఐఎఫ్‌బీ ఎనిమిది స్థానాలు గెలుచుకోవడంతో మున్సిపాలిటీపై పూర్తి ఆధిపత్యం సాధించింది. దీంతో చైర్మన్ పదవి సహా పాలనను స్వయంగా ఏర్పాటు చేసుకునే పరిస్థితి ఏర్పడింది. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వంటి ప్రధాన పార్టీలు ప్రభావం చూపలేకపోవడం రాజకీయంగా కీలక పరిణామంగా మారింది. మొత్తంగా వడ్దేపల్లి మున్సిపాలిటీలో ఫార్వర్డ్ బ్లాక్ విజయం చిన్న పార్టీలకూ ప్రజలు అవకాశం ఇస్తారనే సందేశాన్ని ఇచ్చింది. ఈ ఫలితం స్థానిక రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికర చర్చకు కారణమైంది.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..?

ఉద్యోగం ఉన్న‌ట్టా..?లేన‌ట్టా..? ప‌నిచేస్తున్న‌ట్టా..? చేయ‌డం లేద‌న్న‌ట్టా..?! త్రిశంకు స్వ‌ర్గంలో భూ భార‌తి స‌ర్వేయ‌ర్లు వ‌ర్క ఆర్డ‌ర్...

భూ భారతి కాదు…భూ దోపిడీ!

భూ భారతి కాదు…భూ దోపిడీ! కాంగ్రెస్ నేతలు, అధికారుల జేబులు నింపడానికే కొత్త...

నియో పోలీస్‌కు నీటి భరోసా!

నియో పోలీస్‌కు నీటి భరోసా! జలమండలికి 3.95 ఎకరాల భూమి కేటాయింపు గ్రావిటీ విధానంలో...

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా

కానిస్టేబుల్ సౌమ్య కుటుంబానికి ఎక్సైజ్ విశ్రాంత ఉద్యోగుల ఆసరా ఒక రోజు పెన్షన్‌తో...

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం

పేదల ఇండ్లు కూల్చడం అమానుషం కాంగ్రెస్ పాలనలో క‌క్షపూరిత విధానాలు కొనసాగుతున్నాయి మాజీ మంత్రి...

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల

జీపీలకు రూ.389 కోట్లు.. ఉద్యోగులకు రూ.745 కోట్లు విడుదల పెండింగ్ బిల్లుల చెల్లింపుకు...

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా?

విద్యా కమిషన్‌లో విద్యావేత్తలే లేరా? పీహెచ్‌డీలు లేకుండా విద్యా విధానం ఎలా? అర్హతలేని కమిటీతో...

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం”

“విద్యార్థుల నుంచి అధికారుల వరకూ… ఇది మీ త్యాగాల ఫలితం” ప్రజలు ఆకలిని...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!?

త‌ప్పు జ‌రిగిందా శ్రీరామా..!!? సీజ్ చేసిన క‌ల‌ప‌ మాయం..?! ములుగు జిల్లా అట‌వీశాఖ‌లో క‌ల‌క‌లం వేరే...

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్

కాక‌తీయ ఎక్స్ క్లూజివ్ 116 మునిసిపాలిటీలు.. 7కార్పోరేష‌న్ల‌లో న‌మోదైన పోలింగ్ శాతం వివ‌రాలు ఒక్క...

ఔష‌ధం కాదు.. ! విషం..!!

ఔష‌ధం కాదు.. ! విషం..!! తెలంగాణలో తయారైన 35ర‌కాల మందులు ఫెయిల్‌ సీడీఎస్‌సీవో తనిఖీల్లో...

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..!

ఫుల్ ట్రెండింగ్‌లో మేడారం కొత్త పాట..! చరిత్రకు జానపద స్వరం..అద్భుతం పాట రూపంలో సమ్మక్క–సారలమ్మ...

మేడారంలో హైటెక్ భద్రత

మేడారంలో హైటెక్ భద్రత మూడు కోట్ల మందికిపైగా భక్తుల రాక అంచనా కమాండ్ కంట్రోల్...

పెరిగిన అప్పులు.. తగ్గిన ఆదాయం.. తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆందోళన..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో : 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి...
spot_img

Popular Categories

spot_imgspot_img